తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కాగా వీరిద్దరిదీ ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఈ దంపతులకు అల్లు అర్హ, అల్లు అయాన్ అని కొడుకు కూతురు కూడా ఉన్నారు.అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారాడు.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఒకవైపు అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలను చూసుకుంటూనే మరొకవైపు అల్లు ఫ్యామిలీకి కోడలిగా బాద్యతలు కూడా నిర్వహిస్తోంది.
తన పిల్లలకు అలాగే భర్తకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది స్నేహ రెడ్డి.ఇకపోతే ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో బాగా నిలుస్తోందని చెప్పవచ్చు.
అంతేకాకుండా ఎప్పటికప్పుడు ట్రెండీ వేరుకి తగ్గట్టుగా స్టైలిష్ దుస్తులను ధరిస్తూ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని విధంగా అందంగా రెడీ అవుతోంది.ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కి స్నేహ రెడ్డికి మధ్య గొడవ జరిగిందట.
అదే విషయాన్ని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.గతంలో ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ మాట్లాడుతూ స్నేహ తనపై కోప్పడిందని ఫస్ట్ టైం అలా కోప్పడడం తనకు చాలా బాధేసింది అని చెప్పుకొచ్చాడు.
అల్లు అయాన్ పుట్టిన తర్వాత అల్లు అర్జున్ కంటే అల్లు అయాన్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిందని పిల్లల్ని పెంచడంలో స్నేహం చాలా కేర్ గా ఉంటుంది అని తెలిపాడు అల్లు అర్జున్.
అయితే ఒకరోజు పని మీద బయటకు వెళుతూ అల్లు అయాన్ కి స్నానం చేయించమని చెప్పి వెళ్లిందని, అప్పుడు తాను స్నానం చేయిస్తుండగా అయాన్ స్లిప్ అయ్యి కింద పడటంతో ఆ సమయంలో స్నేహ తనని అరిచిందని నీకు చెప్పి వెళ్ళడం నాది బుద్ధి తక్కువ అని తనపై పైరయ్యిందని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.ఆ మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేక పోతున్నాను అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.పిల్లల విషయంలో స్నేహ రెడ్డి చాలా కేరింగ్ గా ఉంటుందని అప్పుడు ఆశ్చర్యపోయాను ప్రతి కన్నతల్లి కొడుకు విషయంలో ఇలాగే ఉంటుందని అప్పుడు ఆ సమయంలో నాకు అర్థమయింది అని తెలిపారు అల్లు అర్జున్.
తర్వాత నుంచి నేను కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అని తెలిపారు బన్నీ.