అల్లు అర్జున్( Allu Arjun ) ఈ మధ్య కాలంలో వరుసగా బ్రాండ్ ల ప్రమోషన్ కి ఓకే చెబుతున్నాడు.పుష్ప సినిమా( Pushpa movie ) తర్వాత అల్లు అర్జున్ స్థాయి పాన్ ఇండియా రేంజ్ లో పెరిగి పోయింది.
పైగా పుష్ కి గాను అల్లు అర్జున్ ఉత్తమ హీరో అవార్డును జాతీయ స్థాయిలో అందుకున్నాడు.దాంతో బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ కి స్టార్ డమ్ పెరిగింది.
అలాగే సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున క్రేజ్ ని దక్కించుకున్నాడు.అందుకే ఆయన తో తమ సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయి.
అంతే కాకుండా రికార్డ్ స్థాయి లో పారితోషికం కూడా ఇచ్చేందుకు గాను సిద్ధం అవుతున్నారు.
అల్లు అర్జున్ తో ఒక యాడ్ ని చేస్తే ఆ యాడ్ ను దేశం మొత్తం లో కూడా టెలికాస్ట్ చేయవచ్చు.కనుక ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లోనే పారితోషికం ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మహేష్ బాబు కూడా చాలా సంస్థల యొక్క ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
అయితే సౌత్ ఇండియా లేదా తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే మహేష్ బాబు నటించిన యాడ్స్ టెలికాస్ట్ అవుతూ ఉంటాయి.
కనుక ఇక్కడే అర్థం అవుతున్న విషయం ఏంటి అంటే మహేష్ బాబు( Mahesh Babu ) తో పోల్చితే అల్లు అర్జున్ బ్రాండ్ వ్యాల్యూ ఎక్కువ.అందుకే పారితోషికం ను బన్నీ భారీగా దక్కించుకుంటున్నాడు.మహేష్ బాబు చాలా సంవత్సరాలుగా బ్రాండ్ అంబాసిడర్ గా నటిస్తూ పెద్ద మొత్తం లో సంపాదించుకున్నాడు.
అయితే అల్లు అర్జున్ ఈ మధ్య ఎంట్రీ ఇచ్చినా కూడా భారీ మొత్తం లో పారితోషికం రూపంలో సొంతం చేసుకుంటున్న కారణంగా తక్కువ సమయంలోనే మహేష్ బాబు కంటే కూడా ఎక్కువ సంపాదన దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.