టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కరోనా లాక్ డౌన్‌కు కొన్ని రోజుల ముందు తన సొంత ప్రాంతం అయిన మంగలూరుకు వెళ్లిపోయింది.అక్కడే తన కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ ఈ ఆరు నెలల సమయంను ఎంజాయ్ చేసింది.
ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో తాను కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు హైదరాబాద్ రాను, షూటింగ్స్ లో పాల్గొనను అంది.మరో ఇంటర్వ్యూలో కూడా ఈ ఏడాది మొత్తం తాను కెమెరా ముందుకు రావాలని కోరుకోవడం లేదు అంటూ వ్యాఖ్యలు చేసింది.
ఇంతగా మాటలు చెప్పిన ఈ అమ్మడు తాజాగా హైదరాబాద్ వచ్చేసింది.
వచ్చే నెల నుండి ప్రారంభం కాబోతున్న ‘పుష్ప’ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ వర్క్ షాప్ ఏర్పాటు చేయించాడు.
అందులో భాగంగానే రష్మిక మూడు రోజుల ప్లాన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చేసింది.శంషాబాద్ విమానాశ్రయంలో ఈమె కనిపించింది.ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈమధ్య కాలంలో రానంటూ అంత బలంగా చెప్పిన రష్మిక ఇప్పుడు ఎలా వచ్చావంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

కరోనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ రాదని, దాంతో సహజీవనం సాగించాల్సిందే అనే ఉద్దేశ్యంతో అంతా కూడా మెల్లగా షూటింగ్స్ కు జాయిన్ అవుతున్నారు.అందుకే రష్మిక అప్పుడు రానన్నా కూడా ఇప్పుడు వచ్చేసింది.వచ్చే నెల నుండి రెగ్యలర్ షూటింగ్ లో కూడా పాల్గొనబోతుంది.రష్మిక మందన్న ‘పుష్ప’ సినిమాలో బన్నీకి జోడీగా నటించబోతుంది.అలాగే చిత్తూరు యాసలో కూడా ఆమె మాట్లాడబోతుంది.పల్లె అమ్మాయిలు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనే విషయాలను రష్మిక ఈ వర్క్ షాప్ లో నేర్చుకోబోతుందట.