యంగ్ టైగర్ ఎన్టీఆర్ దారిలో నడుస్తున్న అల్లు అర్జున్.. ఆ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

 Allu-arjun-follows-ntrs-formula, Ntr, Allu Arjun, Tollywood, Follow , Pushpa-2-TeluguStop.com

కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ దేవర ని పోస్ట్ పోన్ చేసుకొని కాస్త విరామం ఇచ్చి వార్-2 సినిమా సెట్స్ పైకి వెళ్లాడు.అయితే ఇప్పుడు బన్నీ కూడా ఇదే రూటు ఫాలో అవ్వబోతున్నాడు.

ఎన్టీఆర్ లానే బన్నీ కూడా పుష్ప-2( Pushpa-2 )పై చాలా టైమ్ పెట్టాడు.ఇప్పుడు ఈ హీరో కూడా ఒకేసారి 2 ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ అయ్యాడట.పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే అట్లీ( Atlee Kuma ) ప్రాజెక్టుకు షిఫ్ట్ కానున్నాడు అల్లు అర్జున్.అయితే ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వస్తుందని అందరు భావించారు.

కానీ ప్రకటన కాస్త ఆలస్యమైంది.త్వరలోనే ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు డైరెక్టర్ అట్లీ.

అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సినిమా పని మీదే ఉన్నాడు.

ఆల్రెడీ హీరో-దర్శకుడి మధ్య మీటింగ్స్ కూడా మొదలయ్యాయి.ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో మొదలు కానుంది.కాబట్టి పుష్ప-2 సినిమా కొలిక్కి వచ్చినా రాకపోయినా, బన్నీ మాత్రం తన కొత్త ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.మేకోవర్ సమస్యలు లేకపోతే 2 సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube