యంగ్ టైగర్ ఎన్టీఆర్ దారిలో నడుస్తున్న అల్లు అర్జున్.. ఆ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ దేవర ని పోస్ట్ పోన్ చేసుకొని కాస్త విరామం ఇచ్చి వార్-2 సినిమా సెట్స్ పైకి వెళ్లాడు.

అయితే ఇప్పుడు బన్నీ కూడా ఇదే రూటు ఫాలో అవ్వబోతున్నాడు. """/" / ఎన్టీఆర్ లానే బన్నీ కూడా పుష్ప-2( Pushpa-2 )పై చాలా టైమ్ పెట్టాడు.

ఇప్పుడు ఈ హీరో కూడా ఒకేసారి 2 ప్రాజెక్టులు చేయాలని డిసైడ్ అయ్యాడట.

పుష్ప-2 షూటింగ్ పూర్తయిన వెంటనే అట్లీ( Atlee Kuma ) ప్రాజెక్టుకు షిఫ్ట్ కానున్నాడు అల్లు అర్జున్.

అయితే ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వస్తుందని అందరు భావించారు.

కానీ ప్రకటన కాస్త ఆలస్యమైంది.త్వరలోనే ఈ ప్రాజెక్టును ఎనౌన్స్ చేసి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు డైరెక్టర్ అట్లీ.

అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం త్రివిక్రమ్ బన్నీ సినిమా పని మీదే ఉన్నాడు.

"""/" / ఆల్రెడీ హీరో-దర్శకుడి మధ్య మీటింగ్స్ కూడా మొదలయ్యాయి.ఈ సినిమా కూడా ఇదే ఏడాదిలో మొదలు కానుంది.

కాబట్టి పుష్ప-2 సినిమా కొలిక్కి వచ్చినా రాకపోయినా, బన్నీ మాత్రం తన కొత్త ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.

మేకోవర్ సమస్యలు లేకపోతే 2 సినిమాల్ని ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ.

ఆ కారణంతోనే జబర్దస్త్ మానేశాను… మల్లెమాల వారిపై అవినాష్ షాకింగ్ కామెంట్స్!