సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్( Aishwarya Rai Bachchan ) ఒకరు.ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
తెలుగుతోపాటు తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నారు.ఇక ఈమె చివరిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా కథ ప్రాధాన్యతో ఉన్న సినిమాలలో నటిస్తూ ఐశ్వర్య ఇప్పటికీ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇదిలా ఉండగా నవంబర్ ఒకటవ తేదీ ఐశ్వర్య తన 50 వ పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈమె 50 వ పుట్టినరోజు కావడంతో అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా ఐదు పదుల వయసులోకి అడుగుపెడుతున్న ఇప్పటికీ ఈమె అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారనే చెప్పాలి.
ఇకపోతే ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ ( Abhisekh Bachchan ) పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ కూడా చేస్తున్నారు.తన భార్య 50వ పుట్టినరోజు అంటే ఎంతో స్పెషల్ అని చెప్పాలి.ఒక ప్రత్యేకమైన రోజున అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా ఐశ్వర్యకు హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
ఇలా ఈయన సింపుల్గా బర్త్డే విషెస్ చెప్పడంతో నేటిజన్స్ భారీ స్థాయిలో ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు.భార్య 50వ పుట్టినరోజు అంటే కనీసం గ్రాండ్ గా తనకు బర్త్డే సెలబ్రేషన్స్ చేయలేరా అంటూ కొందరు కామెంట్ చేయడం మరికొందరు మాత్రం హ్యాపీ బర్త్ డే మై లవ్.డార్లింగ్స్.స్వీటీ.
ఏదో ఒకటి చెప్పాలిగా .ఆ మాత్రం సెన్స్ లేదా.? మీ నాన్న పుట్టినరోజు అయితే పెద్ద పెద్ద చాటభారతాన్ని రాస్తావే అంటూ ట్రోల్ చేస్తున్నారు .ఇలా ఐశ్వర్యకు సింపుల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా అంటూ సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.