అమెరికాలో భారతీయుల పతిభ వెలుగు చూడటం.రికార్డులకెక్కడం కొత్తేమీ కాదు.
రోజు వారి వార్తల్లో భారతీయుల్లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట కీర్తించబడుతూనే ఉంటారు…అలాగే తాజాగా అమెరికా మల్టీనేషనల్ బిజినెస్ మ్యాగజైన్లలో అగ్రగామి అయిన ఈ సంస్థ ప్రతీఏటా బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాని ప్రకటిస్తుంది.
ఈ ఏడాది…ప్రకటించిన బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో భారతీయ అమెరికన్ శంతను నారాయణ్ 12వ స్థానంలో నిలిచారు.నారాయణన్ హైదరాబాద్లో జన్మించారు.అయితే ఉన్నత చదువు ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిన నారాయణన్ అక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే ఆయన ఆ కంపెనీ అభివృద్దికి ఎనలేని కృషి చేశారని.కంపెనీకి నమ్మకంగా పనిచేయడమే కాకుండా కంపెనీలో కీలక పాత్ర పోషించారని ఫార్చ్యూన్ పేర్కొంది.2007 నవంబరు నుండి అడోబ్ సీఈవోగా నారాయణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కార్పొరేట్ అమెరికాలో ఇన్నేళ్లపాటు కీలక పదవిలో కొనసాగడం చాలా అరుదైన సంఘటన అంటూ పేర్కొన్నారు.