ఓటర్ల జాబితాలో మీ పేరు లేదని ఆందోళన వద్దు.మీ వద్ద తగిన ఆధారాలు ఉంటే పోలింగ్ రోజున తప్పకుండా ఓటు వేయొచ్చు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో చాలామంది పేర్లు కనిపించలేదు.వెరిఫికేషన్ సమయంలో ఇళ్లలో లేకపోవడం తదితర కారణాల వల్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారు.
అయితే, ఆ పేర్లు పూర్తిగా జాబితా నుంచి తొలగించినట్లు భావిస్తే పొరపాటే.ఆచూకీలేని ఓటర్ల వివరాలను మరో ప్రత్యేక జాబితాలో పొందుపరుచుతారు.అవి ఎన్నికల అధికారుల వద్దే పదిలంగా ఉంటాయి.ఆ లిస్ట్ లో గనుక మీ పేరు ఉంటె…మీరు వోట్ వేయొచ్చు.
పోలింగ్ బూత్ లో ఈ లిస్ట్ ఉంటుంది.అక్కడ మీరు ఆధారాలు చూపించి…సంతకం చేసి వేలి ముద్ర వేస్తె…వోట్ వేయనిస్తారు!
.