అలనాటి నటి సుకన్య గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.
సుకన్య కేవలం నటి మాత్రమే కాదు గాయని, భరతనాట్య కళాకారణి.తెలుగులో నిన్నటితరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగినవారు ఇప్పుడు ముఖ్యమైన .కీలకమైన పాత్రలను చేస్తున్నారు.సీనియర్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ తమ సినిమాలకు హెల్ప్ అవుతుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.ఇక అందువల్లనే వాళ్లను వెతికి మరీ తీసుకొస్తున్నారు.భారీ పారితోషికమే ముట్టజెబుతున్నారు.నదియా .ఆమని .మీనా .సుహాసిని ఇలా మళ్లీ తెరపైకి వచ్చినవారే.ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్లు యంగ్ హీరోలకు తల్లిగానో హీరోయిన్స్ కి తల్లిగానో తెరపై సందడి చేస్తున్నారు.తల్లి పాత్రలకు ఆత్మీయతతో పాటు అందాన్ని కూడా తీసుకొస్తున్నారు.
ఇలా తల్లి పాత్రలు చేసేవారి జాబితాలో ‘పెద్దరికం’ సుకన్య కూడా కనిపిస్తుంది.
అయితే ‘పెద్దరికం’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సుకన్య ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసింది.తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్నందువలన ఆమె తెలుగు సినిమాలకి డేట్లు కేటాయించలేకపోయింది.అలాంటి సుకన్య ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్ బాబు తల్లి పాత్రలో మెరిసింది.
దాంతో ఇక ఆమె ఇక్కడ వరుస సినిమాలు చేస్తుందని అనుకున్నారు.కానీ ‘శ్రీమంతుడు’ తరువాత ఆమె మరో సినిమా చేయలేదు.ఇక కొత్త ప్రాజెక్టులలోను ‘సుకన్య’ పేరు ఎక్కడా వినిపించడం లేదు.పోనీ గతంలో మాదిరిగా ఆమె తమిళ .మలయాళ సినిమాలతో బిజీగా ఉందా అంటే అదీ లేదు.అక్కడ కూడా ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు.
సీనియర్ హీరోయిన్లంతా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంటే సుకన్యకు గ్యాప్ ఎందుకు వచ్చిందనేది అర్థం కావడం లేదు.ఆమెను అడగడం లేదా.ఉద్దేశ పూర్వకంగా ఆమె చేయడం లేదా.అనేదే తెలియడం లేదు.