ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది.. శ్రియ షాకింగ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో వరుసగా రెండు, మూడేళ్లు కూడా కెరీర్ ను కొనసాగించలేక చాలామంది హీరోయిన్లు కెరీర్ విషయంలో ఇబ్బందులు పడుతుంటే హీరోయిన్ శ్రియ( Heroine Shriya Saran ) మాత్రం దాదాపుగా 22 సంవత్సరాల నుంచి విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.స్టార్ హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి సైతం ఆమెకు అభ్యంతరం లేదని తెలుస్తోంది.

 Actress Shriya Saran Comments About Music School Movie Details Here Goes Viral-TeluguStop.com

సీనియర్ హీరోలకు సైతం ఆమె బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Actressshriya, Bollywood, Paparao, Music School, Musicschool, Shriya-Movi

ఇంటి బయటికి రావాలన్నా పోరాటం చేయాల్సిందేనని శ్రియ చెప్పుకొచ్చారు.విభిన్నమైన కథలను ఆమె ఎంచుకుంటున్నారు.ఆమె నటించిన మ్యూజిక్ స్కూల్( Music School ) సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది.

తెలుగుతో పాటు హిందీలో ఈ సినిమా థియేటర్లలో సమాచారం అందుతోంది.పీవీఆర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

శ్రియ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ మూవీ షూట్ కు వెళుతున్న సమయంలో ఇంటికి వెళ్లిన ఫీలింగ్ కలిగిందని అన్నారు.నాకు మంచి పేరెంట్స్ ఉన్నారని అందుకే అనుకున్నది సులువుగా చేస్తున్నానని శ్రియ చెప్పుకొచ్చారు.

నా బంధువుల్లో కొంతమంది ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోందని శ్రియ కామెంట్లు చేశారు.ఈ మూవీ స్టోరీ విన్న తర్వాత అలాంటి విషయాలను అర్థం చేసుకున్నానని శ్రియ తెలిపారు.

Telugu Actressshriya, Bollywood, Paparao, Music School, Musicschool, Shriya-Movi

డైరెక్టర్ పాపారావు( Director Paparao ) ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ఈ తరానికి మ్యూజిక్ స్కూల్ తరహా మూవీ అవసరమని ఆమె చెప్పుకొచ్చారు.పిల్లలకు చదువుతో పాటు ఆటలు, పాటలు, మ్యూజిక్ జీవితంలో భాగం కావాలనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.హీరోయిన్ శ్రియ పారితోషికం పరిమితంగా ఉండటం వల్లే ఆమెకు ఆఫర్లు పెరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube