మాస్ హీరో గోపీచంద్ ( Gopichand )లేటెస్ట్ మూవీ రామబాణం( Rambanam ) శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా చూసిన వారంతా పాత చింతకాయ పచ్చడిలాంటి సినిమా అని చెబుతున్నారు.
గోపీచంద్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తాడని ఆశిస్తే ఇలా రొటీన్ కథతో వచ్చాడేంటి అని అంటున్నారు.శ్రీవాస్ కథ, కథనం ఎక్కడ వర్క్ అవుట్ అవలేదని.
సినిమా కు పెట్టిన ఖర్చు అంతా వేస్టే అంటున్నారు.
అంతేకాదు కథల విషయంలో కొన్నాళ్లుగా తప్పటడుగులు వేస్తున్న గోపీచంద్ ఇక మీదట మారాల్సిందే అని.లేకపోతే కష్టమని అంటున్నారు.గోపీచంద్ ఒకప్పుడు మంచి సినిమాలు చేశారు.
మాస్ ఇమేజ్ తో తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చారు.కానీ ఈమధ్య ఆయనకు సరైన హిట్ పడట్లేదు.
చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.వరుస సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) గోపీచంద్ కి హిట్ ఇస్తుంది అనుకుంటే ఆ బ్యానర్ లో కూడా ఫ్లాప్ పడింది.
రాబోయే సినిమాలతో అయినా గోపీచంద్ తన పంథా మార్చి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.ఒకప్పుడు కథల విషయంలో కొద్దిగా కొత్తగా ఆలోచించిన గోపీచంద్ ఈమధ్య రొటీన్ కథలతో సినిమాలు చేయడం వల్ల కెరీర్ లో వెనకపడ్డారు.