టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో తల్లి పిన్ని అత్త పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రగతి ( Pragathi) ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే కరోనా సమయంలో మాత్రం ఈమె సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు .నిత్యం ఎన్నో రకాల డాన్స్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రగతి ఎక్కువగా జిమ్( Gym )లోనే గడుపుతూ ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈమె జిమ్ లో భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ ఉంటారు.ఇలా వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఇక వెయిట్ లిఫ్టింగ్( Weight Lifting ) భాగంగా చీర కట్టులో కూడా ఎంతో బరువులను ఎత్తుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇలా నాలుగు పదుల వయసులో కూడా ఫిట్నెస్ పై చాలా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ఈమె తాజాగా ఒక అరుదైన రికార్డు సృష్టించారని తెలుస్తుంది.ఇలా వెయిట్ లిఫ్టింగ్ లో ఎంతో అనుభవం ఉన్నటువంటి ప్రగతి తాజాగా కాంస్య పథకం గెలిచారని తెలుస్తోంది.
నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరు ఇంజినీరింగ్ కాలేజీలోని అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన ఉమెన్స్ నేషనల్ బెంచ్ ప్రైస్ ఛాంపియన్ షిప్ లో ఓ ప్రొఫెషనల్ తో పోటీపడి అక్కడ కాంస్యం గెలిచిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా వెయిట్ లిఫ్టింగ్ పై ఎంతో ఫోకస్ పెట్టినటువంటి ఈమె సినిమాలను కూడా తగ్గించేశారు అయితే తాజాగా కాంస్యం గెలుచుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వయసులో ఇలాంటి పథకాలు సాధించారు అంటే మీరు నిజంగా గ్రేట్ ఆంటీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.