తన కూతురును హీరోయిన్ చేయబోనంటున్న జయలక్ష్మి.. ఎందుకంటే? 

సినీ ఇండస్ట్రీలో వారసులు సహజంగానే వస్తుండటం మనం చూడొచ్చు.అయితే, వారసులందరూ సక్సెస్ అవుతున్నారనుకుంటే మీరు పొరపడినట్లే.

 Actress Jayalakshmi About Her Daughter Entry Details, Actress Jaya, Actress Jaya-TeluguStop.com

టాలెంట్, అది ప్రూవ్ చేసుకునేందుకుగాను అవకాశం లభిస్తేనే వారు సక్సెస్ అవుతారు.ఎన్నో కష్టాలు పడి చాలా కాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండి ఫైనల్‌గా హీరోయిన్ అయిన వారు కొందరుండగా, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన వారూ ఉన్నారు.

ఈ క్రమంలోనే తన కూతురును హీరోయిన్ చేయబోనంటుందో ఏమో తెలియదు కాని ఓ ప్రముఖ నటి తన కూతురును కథనాయికగా ఇంట్రడ్యూస్ చేయదట.

సినీ పరిశ్రమలో ఉండే కష్టనష్టాల గురించి తెలిసిన వ్యక్తిగా తను తన కూతురిని హీరోయిన్ చేయబోనని అంటోంది నటి జయలక్ష్మి.

తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ నటి అయినటువంటి తాను తన కూతురిని మాత్రం కథనాయిక చేయబోనని అంటోంది.అయితే, బాలనటిగా మాత్రం ఆల్రెడీ వెండితెరపైన కనిపించి జయలక్ష్మి డాటర్.

తేజ డైరెక్షన్‌లో నితిన్, సదా జంటగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జయం’ లో హీరోయిన్ చెల్లెలిగా నటించింది జయలక్ష్మి కూతురు యామిని శ్వేత. ఇక ఆ తర్వాత యామిని శ్వేత వెండితెరపైన ఎప్పుడూ కనిపించలేదు.

‘జయం’ ఫిల్మ్ తర్వాత యామిని శ్వేత ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్‌కు వెళ్లింది.చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించుకుంది.

అక్కడే పెళ్లి చేసుకుని జీవితంలో ఆనందంగా ఉంటోంది యామిని శ్వేత.

Telugu Actress Jaya, Actressjaya, Jayam, Tollywood, Yamini Shwetha-Movie

యామిని శ్వేతను కావాలనే తాను హీరోయిన్ చేయలేదని ఆమె తల్లి జయలక్ష్మి తెలిపింది.ఇందుకు గల కారణాలు కూడా చెప్పింది.సినీ ఇండ్ట్రీలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని, స్వయంగా తాను పడిన కష్టాలు మళ్లీ తన కూతురు పడటం ఇష్టం లేదని, అందుకే తన కూతురును కేవలం బాలనటిగానే పరిచయం చేశానని పేర్కొంది.

జయలక్ష్మి తను పడినటువంటి కష్ట నష్టాలు తన కూతురు పడి మళ్లీ స్టార్ హీరోయిన్ ఎదగడం సాధ్యమవుతుందో కాదోనని అనుకుందేమో తెలియదు.కాని బాలనటిగా మాత్రం యామిని శ్వేతను పరిచయం చేసేసింది.

బాలనటిగా తన కూతురిని చూసి ఆనందపడిపోయింది జయలక్ష్మి.తన కూతురు మ్యారేజ్ చేసుకుంటే ప్రజెంట్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోందని చెప్తోంది జయలక్ష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube