50 వేల కోసం నటుడు రంగారావు మందు మానేసిన ఆ కథ ఏంటో తెలుసా.. ?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్వీ రంగారావు గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.

 Actor Sv Rangarao Personal Life Unknown Facts, Rangarao, Sv Rangarao, Unknown Fa-TeluguStop.com

పౌరాణికం, కుటుంబ కథ చిత్రాలలోనూ ఆయన నటన ఎంతగానో ఆకట్టుకుంది.రంగారావు అనగానే అందరికి గుర్తుకు వచ్చేవి రెండు విషయాలు మాత్రమే.

వీటిలో మొదటిది ‘పండంటి కాపురం’.ఆయన షూటింగ్‌కు సరిగ్గా రారని., ఇబ్బంది పెడతారని పేరు ఉండేది.ఈ సినిమాలో జమున పోషించిన రాణీ మాలినీదేవి వేషానికి ముందు భానుమతిని అనుకున్నారు.అయితే ఈ విషయం భానుమతికి కోపం తెప్పించడంతో ఈ సినిమాకు పోటీగా మరో సినిమా మొదలు పెట్టాలనుకుంది.

అయితే ఆ సినిమాలో ఒక వేషం వేయమని గుమ్మడిని ఆమె అడిగారు.

ఈ విషయాన్ని గుమ్మడి ‘పండంటి కాపురం’ షూటింగ్‌ సమయంలో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు.దీంతో రంగారావుకి కోపం వచ్చింది.

‘ఇంతమంది ఆర్టిస్టులు ఈ సినిమా కోసం కష్టపడుతుంటే భానుమతి పోటీగా సినిమా తీస్తుందా? ఎలా తీస్తుందో చూస్తానని రంగారావు అన్నారంట.ఇక ఆరోజు నుండి పండంటి కాపురం సినిమా షూటింగ్ ఐపోయేవరకు షూటింగ్ కి ఏడు గంటలకే వెళ్లేవారంట.

Telugu Devuduchesina, Fiftythousand, Gummadi, Habbit, Jamuna, Rangarao, Sv Ranga

ఆలా ఆయన వర్క్‌ 16 రోజుల్లో పూర్తి చేశారు.మిగిలిన ఆర్టిస్టులు కూడా సహకరించడంతో సినిమా తొందరగా పూర్తయింది.

ఇక రెండోవ విషయానికి వస్తే.దేవుడు చేసిన మనుషులు’.ఈ సినిమా డేట్స్‌ కావాలని నేనే ఆయనను అడిగా.‘పండంటి కాపురం’ చిత్రానికి మీరు 30 వేలే ఇచ్చారు.

ఏమన్నా న్యాయంగా ఉందా?’ అని ఆయన అడిగారు.‘సరే సార్‌.పది రోజులు మందు జోలికి వెళ్లకుండా ఈ సినిమాకు పనిచేయండి.50 వేలు ఇస్తాను’ అన్నాను.‘నిజంగా ఇస్తావా?’ అని అడిగారాయన.

అయితే రంగారావుకు ఒక్క షరత్ పెట్టారు.

అదేంటంటే.మీరు తాగుడు మానేసి సెట్‌కు వస్తే తప్పకుండా ఇస్తా’ అన్నారు.

Telugu Devuduchesina, Fiftythousand, Gummadi, Habbit, Jamuna, Rangarao, Sv Ranga

రంగారావు కూడా సరేనన్నారు.బెంగళూరులో ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్‌ జరిగింది.రంగారావు తన మాట నిలబెట్టుకున్నారు.మందు జోలికి వెళ్లకుండా బుద్దిగా షూటింగ్‌కి వచ్చేవారు.వర్క్‌ పూర్తి కాగానే చైనీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుల్లుగా తినేసి రూమ్‌కి వెళ్లి పడుకునేవారు.మళ్లీ పొద్దునే ఏడు గంటలకు సెట్‌కు వచ్చేవారు.

అలా పది రోజులు పనిచేశారు.ఆయన వర్క్‌ పూర్తయింది.

సంతోషంగా 50 వేలు తీసుకెళ్లిపోయారంట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube