తెలుగు ప్రేక్షకులకు కమెడియన్, నటుడు పృథ్వీరాజ్ ( Prithviraj )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ఇటీవల కాలంలో కామెడీ షోలలో మెరవడంతోపాటు, బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చారు.అలాగే నటుడు రఘు బాబు గురించి కూడా మనందరికీ తెలిసిందే.
ఆయన కూడా తెలుగులో పలు సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా పృథ్విరాజ్ రఘు బాబు ( Raghu Babu )ఆస్తిపాస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం అమరావతి భూముల పరిస్థితి గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.రఘుబాబు స్థలం కొన్న విషయాన్ని కూడా బయటపెట్టేశారు.దర్శకుడు డైమండ రత్నబాబు ( Diamond Ratnababu )హోస్ట్‌గా సుమన్ టీవీలో కొత్తగా ఒక టాక్ షో మొదలుపెట్టారు.ఈ టాక్ షోకు పృథ్వీ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన సినీ, రాజకీయ, వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేశారు.ఈ క్రమంలో ఏపీ రాజధాని గురించి పృథ్వీని డైమండ్ రత్నబాబు ఒక ప్రశ్న అడిగారు.
అన్ని రాష్ట్రాలకూ రాజధాని ఉంది.మన రాష్ట్రానికి రాజధాని లేదు.
మీకు బాధ కలుగుతుంటుందా అని పృథ్వీని రత్నబాబు అడిగారు.ఈ ప్రశ్నకు పృథ్వీ స్పందిస్తూ.
చాలా బాధ కలుగుతుంటుంది.
హైదరాబాద్( Hyderabad ) లో ఉండమన్నారు.పదేళ్లు వద్దనుకుని అక్కడికి వెళ్లిపోయారు.అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని అన్నారు.
పాపం రైతులు అడుక్కుతింటున్నారు ఈ రోజున.అంతెందుకు మన కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, మాకు బాగా కావాల్సిన వ్యక్తి, అభిమానించదగిన వ్యక్తి రఘుబాబు జాయింట్ వెంచర్‌లో 15 ఎకరాలో 20 ఎకరాలో కొన్నారు.
వచ్చేస్తోంది కోకాపేట టైప్‌లో అన్నారు.మొత్తం పడిపోయింది అని అన్నారు.
అయితే, తమ ప్రభుత్వం వస్తే అమరావతే రాజధాని అని పృథ్వీ స్పష్టం చేశారు.నిజానికి అమరావతి రాజధాని ప్రాంతంలో రఘుబాబు భూమి కొనుగోలు చేసినట్టు ఇప్పటి వరకు పెద్దగా ఎవ్వరికీ తెలీదు.
ఇప్పుడు పృథ్వీ ఆ రహస్యాన్ని బయటపెట్టేశారు.అయితే, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశ జనసేన కూటమి గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మళ్లీ అమరావతినే రాజధానిగా ప్రకటిస్తారు.
ఇలా జరిగితే మళ్లీ రఘుబాబు కొనుగోలు చేసిన భూమి ధరలకు రెక్కలొస్తాయి.