అభినయ(Abhinaya).ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే.
మాటలు రాకపోయినా కూడా సినిమాల్లో అచ్చం మాటలు వచ్చిన అమ్మాయిలాగే కనిపిస్తుంది.ఈమె ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలకి చెల్లి పాత్రలో నటించి అదరగొట్టింది.
ఇక అలాంటి అభినయ కి కోలీవుడ్ హీరో విశాల్ (Vishal) కి పెళ్లి అంటూ ఇప్పటికే చాలా వార్తలు వైరల్ అయ్యాయి.అయితే ఈ విషయంలో కోలీవుడ్ హీరో విశాల్ స్పందించి అలాంటిదేమీ లేదు అని చెప్పుకొచ్చారు.
ఇక అభినయ కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది.అయితే తాజాగా నేను విశాల్ భార్య ని కాబోతున్నాను.నా కల నెరవేరింది అంటూ అభినయ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి నిజంగానే విశాల్ అభినయలు పెళ్లి చేసుకోబోతున్నారా? అభినయ ఎందుకు అలా మాట్లాడింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.అభినయ విశాల్ భార్య( Vishal Wife ) కాబోతున్నాను అని మాట్లాడింది నిజమే.కానీ విశాల్ కి నిజ జీవితంలో కాదు రీల్ లైఫ్ లో అభినయ విశాల్ భార్యగా నటించబోతుందట.
ఇక ఇదే విషయాన్ని అభినయ (Abhinaya) ప్రస్తావిస్తూ.నేను చాలా రోజులుగా ఒక కలకన్నాను.
అదే విశాల్ ని కలవడం.
నా కల మార్క్ ఆంటోని (Mark Antony) సినిమాతో నెరవేరింది.ఎందుకంటే ఈ సినిమాలో నేను విశాల్ కి భార్యగా నటిస్తున్నాను.రజనీకాంత్ తర్వాత నాకు బాగా ఇష్టమైన హీరో విశాల్ మాత్రమే.
ఒక్కసారి అయినా కలవాలని ఎప్పటినుంచో అనుకున్నాను.కానీ అది మార్క్ ఆంటోనీ సినిమాతో నెరవేరింది.
ఈ సినిమాలో నేను విశాల్ కి భార్యగా చేస్తున్నాను.అలాగే విశాల్ (Vishal) గురించి నేను బయట ఏదేదో అనుకున్నాను.
కానీ ఆయన నేను అనుకున్నట్లు కోపిష్టి అస్సలు కాదు.ఆయనలో సహనం, ఓపిక అనే గుణాలు చాలా ఉన్నాయి.
అలాగే అందర్నీ సరి సమానంగా చూస్తారు.అంటూ అభినయ(Abhinaya) రీల్ లైఫ్ లో విశాల్ భార్యగా నటించబోతున్నాను అంటూ తెగ సంబరపడిపోతూ ఈ విషయాన్ని చెప్పింది.అలాగే విశాల్ తో తాను సీక్రెట్ రిలేషన్ లో ఉన్నాను అంటూ వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు అని,మా పెళ్ళంటూ వస్తున్న వార్తలు కూడా అన్ని పుకార్లే అని మరోసారి విశాల్ తో పెళ్లి,రిలేషన్ రూమర్ పై స్పందించి క్లారిటీ ఇచ్చింది అభినయ.