ప్రేమ కావాలి, లవ్ లీ సినిమాలతో టాలీవుడ్ లో హీరోగా కేరీర్ మొదలుపెట్టిన ఆది సాయికుమార్ ఆ రెండు సినిమాలతో మంచి ఫలితాలను అందుకున్నారు.అయితే లవ్ లీ తర్వాత ఆది సాయికుమార్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ లేదు.
ఆది సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదలవుతున్నా ఆ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.నిన్న ఆది సాయికుమార్ నటించిన అతిథి దేవోభవ సినిమా విడుదల కాగా ఈ సినిమాకు తొలిరోజు 18 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
ఆది సాయికుమార్ రేంజ్ కు ఈ మొత్తం చాలా తక్కువ మొత్తమని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫుల్ రన్ లో ఈ సినిమా కోటిన్నర రూపాయల షేర్ కలెక్షన్లను సాధించాల్సి ఉంది.
అయితే రివ్యూలు పాజిటివ్ గా రాకపోవడంతో అతిథి దేవోభవ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం కష్టమేనని చెప్పవచ్చు.అయితే ఈ హీరో తాజాగా బెంజ్ కారును కొనుగోలు చేశారు.
సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఈ హీరో చేతిలో సినిమాలు మాత్రం ఉన్నాయి.
ఆది సాయికుమార్ నటించిన సినిమాల శాటిలైట్ హక్కులకు బాగానే డిమాండ్ ఉండటంతో నిర్మాతలు ఆదితో సినిమాలను నిర్మించడానికి ముందుకొస్తున్నారు.
కొత్త కారును కొనుగోలు చేయడంతో కారు ముందు తండ్రి, భార్య, పిల్లలతో ఫోటోలు దిగి ఆది సాయికుమార్ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.బెంజ్ కారుకు స్పీడ్ ఎక్కువని ఆది సాయికుమార్ కేరీర్ కూడా అదే విధంగా పుంజుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆది సాయికుమార్ కొనుగోలు చేసిన ఈ కారు 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తున్న ఆది సాయికుమార్ తర్వాత సినిమాలతో అయినా విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.