మంచు పర్వతంపైన నివసిస్తున్న మహిళ... మహిళలపాలిట ధీరవనిత!

స్త్రీ ఒక అబల… ఇది ఒకప్పటి మాట.నేడు పరిస్థితి మారింది.

 A Woman Living On A Mountain Of Ice Brave Among Women ,icy Mountain, Mountain L-TeluguStop.com

ఇప్పటి తరం మహిళలు తమ హక్కులకోసం ఏ స్థాయికి వెళ్లైనా పోరాడుతున్నారు.ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు( women ) దూసుకుపోతున్నారు చెప్పడంలో అతిశయోక్తిలేదు.

తాజాగా ఓ మహిళ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.మెక్సికోలోని సాల్టిల్లోకి చెందిన ‘పెర్లా టిజెరినా‘( Perla Tijerina ) అనే 31 ఏళ్ల మహిళ ప్రస్తుతం ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికాలోని ఎత్తైన పర్వతమైన పికో డి ఒరిజాబా శిఖరం వద్ద తీవ్ర పరిస్థితులను భరించి బతుకుతున్నారు.

ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా ఆమె ముందుకుపోతున్నారు.మహిళలు ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొనగలరు అని ప్రపంచానికి చాటిచెప్పడమే ఆమె ధ్యేయం.ఇకపోతే పెర్లా సముద్ర మట్టానికి 18,491 అడుగుల ఎత్తులో మంచుతో కప్పబడిన అగ్నిపర్వతం పైన 32 రోజులు పాటు గడపనున్నారు.పెర్ల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 2,500 మందికి పైగా అనుచరులతో తన ప్రయాణాన్ని తరచుగా డాక్యుమెంట్ చేస్తుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “నేను నా మానసిక బలాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాను.ఇది ఈ గొప్ప సవాలును నిర్వహించడానికి నన్ను నడిపించింది, దీనికి నేను ‘ఎత్తైన మహిళ’ అని పేరు పెట్టాను” అని పెర్లా పేర్కొంది.

ఈ క్రమంలో పెర్లా ( Perla )దారుణమైన గాలులు, విద్యుత్ తుఫానులు, అల్పోష్ణస్థితి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం ఎదుర్కొంటోంది.ఇలా ఆమె జీవించడానికి ముందు ఆమె క్షుణ్ణంగా వైద్య పరీక్షలు చేయించుకుంది.ఆమె భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి శిఖరం వద్ద నిరంతరం పర్యవేక్షించబడుతుంది.తాను ఎప్పుడూ ఒంటరిగా లేను అని పెర్లా ఈ సందర్భంగా అన్నారు.తాను చదవడానికి చాలా పుస్తకాలు ఉన్నాయని, తాను ధ్యానం చేస్తున్నాను అని కూడా తెలిపింది.అడ్డంకులు ఎదురైనప్పటికీ వదులుకోకుండా ప్రోత్సహించే ప్రేరణ కోసం చూస్తున్న మహిళలందరికీ తాను ప్రేరణగా ఉండాలనుకుంటున్నాను అని పెర్లా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube