నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశంలో ట్విస్ట్ నెలకొంది.అది ఫోన్ ట్యాపింగ్ కాదు.
రికార్డింగ్ అని కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి తెలిపారు.
కోటంరెడ్డితో తాను మాట్లాడిన ప్రతి కాల్ తన ఫోన్ లో రికార్డు అవుతుందని రామశివారెడ్డి వెల్లడించారు.
ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ కు తన ఫోన్ నుంచి ఆడియో షేర్ అయిందని పేర్కొన్నారు.తన ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడానికి సిద్ధమని చెప్పారు.