పుష్ప2 కంటే ముందు మరో సినిమా.. అల్లు అర్జున్ నుంచి త్వరలోనే షాకింగ్ ప్రకటన?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏడాది చివర్లో పుష్ప సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ను అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

 A Shocking Announcement From Allu Arjun Soon , Allu Arjun, Pushpa, Tollywood, Shocking Announcement,-TeluguStop.com

ఇప్పటికీ ఎక్కడ చూసినా పుష్ప సినిమాలోని డైలాగులు పాటలే వినిపిస్తూ ఉన్నాయి.ఇక తగ్గేదేలే అన్న డైలాగ్ అయితే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ డైలాగును ఉపయోగిస్తూనే ఉన్నారు.

అయితే పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ పుష్ప సినిమా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అవ్వడంతో పుష్ప పార్ట్ 2 ను అంతకుమించి ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

 A Shocking Announcement From Allu Arjun Soon , Allu Arjun, Pushpa, Tollywood, Shocking Announcement, -పుష్ప2 కంటే ముందు మరో సినిమా.. అల్లు అర్జున్ నుంచి త్వరలోనే షాకింగ్ ప్రకటన-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు పెట్టి జూలై లేదా ఆగస్టు లోపు సినిమాను ముగించాల్సి ఉంది.

కానీ ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ ను ముగించలేదు.అంతేకాకుండా షూటింగ్ కు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.పుష్ప పార్ట్ 2 లో కేజిఎఫ్ 2 సినిమాను మించిన యాక్షన్ కన్నివేశాలతో పాటుగా అద్భుతమైన హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు ఉండబోతున్నట్లు సన్నిహితుల వర్గాలను సమాచారం.ఇకపోతే ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కంటే ముందు మరొక సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రాబోతుందట.ఆ సినిమా ప్రకటన అల్లు అర్జున్ అభిమానులందరికీ షాకింగ్ గా ఉండబోతోంది అన్నట్టు తెలుస్తోంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే పుష్ప2 సినిమాకు ముందు మరొక సినిమా చేసే ఉద్దేశమే ఉంటే ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేవారు అల్లు అర్జున్.

కానీ పుష్ప తరువాత పుష్ప 2 వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరే సినిమాకు ఓకే చెప్పలేదట అల్లు అర్జున్.పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఇటువంటి వార్త వినిపించడంతో అభిమానులు పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.అల్లు అర్జున్ నుండి నిజంగానే ఆ షాపింగ్ ప్రకటన వస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube