వీడియో చూస్తూ ప్రియురాలి కి ప్రసవం,శిశువు మృతి

తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది.ఓ యువకుడు కడుపుతో ఉన్న తన ప్రియురాలికి యూట్యూబ్ లో వీడియో చూస్తూ ప్రసవం చేసే ప్రయత్నం చేశాడు.

 A Boy Friend Who Tried To Give Birth To A Young Woman Watching Youtube In Tamil-TeluguStop.com

ఈ క్రమంలో శిశువు కడుపులోనే మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….

తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందిన సౌందర్(27) స్థానికంగా ఓ ప్రైవేటు వంట గ్యాస్ కంపెనీలో పనిచేస్తుంటాడు.అయితే ఓ కాలేజీ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరవ్వడం తో ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.

సదరు యువతికి ప్రెగ్నెసీ సమయంలో వచ్చే శారీరక మార్పులపై తల్లిదండ్రులు పలుమార్లు అడిగినా మాములు అనారోగ్యమేనని చెబుతూ వచ్చింది.అయితే ఇటీవల ఎనిమిది నెలలు నిండాయి.

దీనితో బుధవారం ప్రసవ నొప్పలు కూడా రావడంతో సదరు యువతి సౌందర్‌కు ఫోనులో సమాచారం అందించింది.అయితే వెంటనే సౌందర్ గుమ్మిడిపూండిలోని ఓ దుకాణానికి వెళ్లి గ్లౌజులు, కత్తెర, బ్లేడు తదితర సామగ్రిని తీసుకున్నాడు.

అనంతరం ద్విచక్ర వాహనంపై కమ్మవారుపాళ్యం సమీపంలోని అడవికి యువతిని తీసుకెళ్లాడు.అక్కడ ఓ చెట్టు కింద యువతిని పడుకోబెట్టాడు.

మొబైల్‌లో యూట్యూబ్ వీడియో వీక్షిస్తూ యువతికి ప్రసవం చేసేందుకు ప్రయత్నించాడు.తాను వెంట తెచ్చుకున్న బ్లేడుతో కోయడంతో గర్భసంచిలోని శిశువు చేయి కూడా తెగిపోవడంతో యువతి పేగు సైతం తెగి తీవ్రంగా రక్తస్రావమైంది.

ఈ క్రమంలో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అప్పుడు తేరుకున్న అతడు అతికష్టం మీద ఆ యువతిని పొన్నేరి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

దీనితో వైద్యులు యువతి పరిస్థితి విషమంగా ఉండడం తో చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లమని చెప్పారు.

అక్కడ శస్ర్త చికిత్స చేసి గర్భంలోని మగ శిశువు మ‌ృతదేహాన్ని వైద్యులు బయటకు తీశారు.యువతి ఆరోగ్య స్థితి ప్రస్తుతం నిలకడగానే ఉండగా, ప్రియుడు సౌందర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.

ఈ రోజుల్లో యూట్యూబ్ లు చూస్తూ పలు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఇలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube