టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న ఏ హీరోయిన్‌కు దక్కని అరుదైన అవకాశాలు కాజల్‌కు దక్కాయి.‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్‌కు జోడీగా పరిచయం అయిన కాజల్‌కు మొదటి సినిమాతో నిరాశే మిగిలింది.
ఆ తర్వాత కాజల్‌కు ‘చందమామ’ సినిమా లైఫ్ ఇచ్చింది.ఆ తర్వాత జక్కన్న తెరకెక్కించిన ‘మగధీర’ సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా హీరోయిన్గా నటించడంతో ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌తో పోల్చితే అత్యధిక స్టార్ హీరోలతో పాటు అత్యధిక స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన ఘనతను కాజల్ దక్కించుకుంది.
తెలుగులో ఇప్పటి వరకు మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ప్రభాస్, రవితేజ, నాగచైతన్య, కళ్యాణ్ రామ్, రామ్, నితిన్, సుమంత్ ఇలా ఎంతో మంది స్టార్స్‌తో కాజల్ రొమాన్స్ చేసింది.
ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్’ సినిమాలో సైతం నటించేందుకు సిద్దం అవుతోంది.ఈ స్థాయిలో సమంత, తమన్నా, అనుష్క వంటి స్టార్స్ నటించలేక పోయారు.
ఇక ఈమె పలువురు స్టార్ డైరెక్టర్స్‌తో కూడా వర్క్ చేసింది.రాజమౌళి, వినాయక్, సుకుమార్, వంశీపైడిపల్లి, శ్రీనువైట్ల, తేజ, కరుణాకరణ్, పూరి, కృష్ణవంశీ వంటి ప్రముఖ దర్శకుల సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
ఇంత మంది స్టార్ డైరెక్టర్స్లతో ప్రస్తుతం ఉన్న ఏ ఇతర హీరోయిన్ కూడా వర్క్ చేయలేదు.ఇలా కాజల్ ఎంతో మంది స్టార్స్‌తో పని చేసే అదృష్టం దక్కించుకుంది.