జుట్టు ( hair )విపరీతంగా రాలిపోతుందా.? ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.? అయితే అస్సలు చింతించకండి.నిజానికి అందరిలోనూ జుట్టు రాలడానికి ఒకే రకమైన కారణాలు ఉండవు.
కారణం ఏదైనా జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఒక అద్భుతమైన టానిక్ ఉంది.ఈ టానిక్ వాడటం అలవాటు చేసుకుంటే కేవలం రెండు వారాల్లోనే మీరు అదిరిపోయే రిజల్ట్ ను గమనిస్తారు.
మరి ఇంతకీ ఆ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) మరియు ఒక కప్పు వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఐదు నుంచి ఆరు జామ ఆకులను( Six guava leaves ) తీసుకుని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే జామ ఆకులు వన్ టీ స్పూన్ లవంగాలు వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
దాంతో మన టానిక్ అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడు స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ న్యాచురల్ హెయిర్ టానిక్ ను వాడితే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.అలాగే ఈ టానిక్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది.స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారికి జామాకులు, మెంతులు, లవంగాలతో తయారు చేసే ఈ టానిక్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.