వీడియో: ఈ డోర్ ఎంత బలంగా ఉందో.. ఏనుగులు తోసినా అంగుళం కదలదట..!!

పాత ఇళ్లంటేనే ఒక వింత.వాటి నిర్మాణంలో వాడిన వస్తువులు ఎంత క్వాలిటీ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 Varanasi Antique Door With Solid Locking System Video Viral Details, Ancient Doo-TeluguStop.com

అందుకే అవి శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరకుండా ఉంటాయి.అలాంటి ఇళ్లల్లో తలుపుల( Doors ) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

అవి చాలా దృఢంగా, ఇంటితో పాటే పుట్టినట్టుంటాయి.వారణాసి( Varanasi ) లాంటి చారిత్రాత్మక నగరాల్లో ఇలాంటి అపురూపమైన కట్టడాలు, తలుపులు ఇప్పటికీ దర్శనమిస్తాయి.

ఇటీవల, బెనారస్‌లో( Banaras ) ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న 200 ఏళ్ల నాటి ఓ చెక్క తలుపును( Wooden Door ) చూపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.ఆ తలుపుకున్న ప్రత్యేకమైన, భద్రమైన తాళం వ్యవస్థ అందరినీ కట్టిపడేసింది.

స్మృతి అనంత్ (@wanderers.of.varanasi) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ అద్భుతమైన వీడియోను షేర్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆ వీడియోలో స్మృతి, ‘సర్’ అని పిలిచే ఒక వ్యక్తితో కలిసి వారణాసిలోని ఒక పాత ఇంటికి వెళ్తుంది.

అక్కడ వాళ్లు ఆ పురాతన చెక్క తలుపును చూపిస్తారు.

ఇంటి యజమాని మాటల్లో చెప్పాలంటే, ఈ తలుపు వయసు అక్షరాలా 200 నుంచి 250 ఏళ్లు! ఆరు అంగుళాల మందపాటి కలపతో తయారు చేసిన ఈ తలుపును చూస్తే దాని బలం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.దీన్ని మూయడమే ఒక పెద్ద పని.రెండు చేతులూ ఉపయోగించి గట్టిగా తోస్తే కానీ మూతపడదు.ఇక మూశాక దీని భద్రత గురించి చెప్పేదేముంది? మూడు అంచెల పటిష్టమైన లాకింగ్ సిస్టమ్( Solid Locking System ) దీని సొంతం.మొదటగా, పైభాగంలో ఒక చెక్క గొళ్ళెం వేస్తారు.

ఆ తర్వాత, మధ్యలో ఒక బరువైన చెక్క అడ్డుకర్రను అడ్డంగా పెడతారు.ఇక చివరగా, దిగువన ఉన్న ఒక చిన్న గొళ్ళెం వేస్తే ఇక అంతే సంగతులు – కోటలా మారిపోతుంది.

రెండు ఏనుగులు ఒకేసారి బయటి నుంచి తోసినా ఈ తలుపును కనీసం కదిలించలేవని యజమాని గర్వంగా చెబుతున్నాడు.ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.ఏకంగా 10 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.దీనికి వస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు.ఒక నెటిజన్ అయితే “ప్రధానమంత్రికి కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు” అని సరదాగా కామెంట్ చేశాడు.ఇంకొకరు “SBI బ్యాంకులు ఈ లాకింగ్ సిస్టమ్‌ను వాడాలి” అని సలహా ఇచ్చాడు.

మరొకరు దీన్ని “Z+++ సెక్యూరిటీ” అంటూ పొగిడారు.నిజంగానే ఈ తలుపు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube