తోటి క్లాస్ మేట్ లతో కలిసి మిత్ర మండలి ఏర్పాటు , నిరుపేదలకు అపన్న హస్తం అందించేందుకే ఏర్పాటు,రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla):పుట్టి పెరిగిన గడ్డ పై ఎనలేని ప్రేమ ఆయనకు.తాను కూడా అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని ఒక స్థాయికి వచ్చిన తాను తన మండలంలో గల నిరుపేదలకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో నేడు ఎల్లారెడ్డి పేట మండలంలో తన క్లాస్ మెట్ లు 20 మంది కలిసి సత్యమన్న మిత్ర మండలి నీ ఏర్పాటు చేయడం జరిగింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎల్లారెడ్డి పేట మండలం కోరుట్లపేట(Ellareddy Peta Mandal Korutlapeta) కు చెందిన మేడిపల్లి సత్యం (చొప్పదండి శాసన సభ్యులు) అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పుట్టిన గడ్డ పై సహాయం చేయాలని సంకల్పంతో కమిటీ ఏర్పాటు చేయాలని తన తోటి క్లాస్ మేట్ లతో చర్చించి సత్యమన్న మిత్ర మండలి నీ వ్యవస్థాపక అధ్యక్షుడు గా బొప్ప పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ రెడ్డి నీ నియమితులయ్యారు.
వీరితో పాటు ఉపాధ్యక్షులు గా నాయిని భాస్కర్ రెడ్డి,రుద్రోజు భాస్కర్, చొక్కం భాస్కర్,గూడ అనిల్, ప్రధాన కార్యదర్శి గా ఒగ్గు బాలరాజు యాదవ్, కోశాధికారిగా శ్రీ రామోజీ దేవరాజు,తో పాటు 20 మంది సత్యం క్లాస్ మేట్ లతో కమిటీ ఏర్పాటు చేశారు.సత్యమన్న మిత్ర మండలి (Satyamanna Mitra Council)సభ్యులు మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలో గల కడు నిరుపేదలు ఎవరైనా చనిపోయిన కానీ, నిరుపేద యువతుల వివాహం కోసం 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని మిత్ర మండలి సభ్యులు తెలిపారు.
అవసరం ఉన్న వారు ముత్యాల సత్యనారాయణ రెడ్డి సెల్ నంబర్ 9963255109, చొక్కం భాస్కర్ 9441797308, నాయిని భాస్కర్ రెడ్డి 8500817500,రుద్రొజు భాస్కర్, 995174704, గూడ అనిల్ 9949457816,ఒగ్గు బాలరాజు యాదవ్ 9059519691,శ్రీ రామోజీ దేవరాజు 9704096807, బొందుగుల దేవారెడ్డి 9676167498 లను సంప్రదించాలని కోరారు.