రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట( Yellareddype ) మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎల్లారెడ్డిపేటకు చెందిన బొప్పాపూర్ హెల్త్ వెల్ నెస్ సెంటర్( Boppapur Health Wellness Centre ) కు కాయకల్ప అవార్డు రెండవసారి వచ్చిందని మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బొప్పాపూర్ సబ్ సెంటర్ కు రెండవసారి కాయకల్ప అవార్డు రావడం చాలా సంతోషం అని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు అన్నారని, అలాగే ఇందుకు గాను శ్రమించిన ప్రతి ఒక్క వైద్య సిబ్బందిని అభినందించారు అని తెలిపారు.
అలాగే మండల వైద్యాధికారి మాట్లాడుతూ 2023-2024 వార్షిక సంవత్సరముకు ఈ అవార్డు వచ్చిందని, ఇందుకు ప్రతి ఒక్క సిబ్బంది చాలా కృషి చేశారు.రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు రావడానికి సిబ్బంది ఇలానే కష్టపడాలి అని అన్నారు.
ఇందుకు అన్నివేళలా తమ సహకారం ఉంటుందని తెలిపారు.అలాగే డాక్టర్ స్రవంతికి ఏఎన్ఎం పద్మజకి ఆశాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.