భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పలు కుటుంబాలను, ప్రాంతాలను సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

రాజన్న సిరిసిల్ల జిల్లా :గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన నేరళ్ళ సరోజన, మల్యాల రాజేశం ఇండ్లు కూలిపోగా సోమవారం ప్రభుత్వ విప్ , వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ( Adi Srinivas )పరిశీలించారు.ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

 Government Whip Adi Srinivas Visited Many Families And Areas Affected By Heavy R-TeluguStop.com

అనంతరం లింగంపేట గ్రామంలోని గురునాథం చెరువు అలుగు దుంకి వరద ఉధృతిని పరిశీలించారు.సనుగుల గ్రామంలో వరద ఉధృతికి కోతకు గురైన రోడ్డును, పొలాలను పరిశీలించారు.

రోడ్డు మరమ్మతులు చేపట్టవలసిందిగా అధికారులకు ఆదేశాలు చేశారు.అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంటు స్థంభాలను, వైర్లను, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు.

చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్ళద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.వరద ఉధృతిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

వరద ఉధృతి కారణంగా నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube