సాధారణంగా దర్శకులు క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు.ఒకరిని తీసుకున్న తర్వాత వారు సరిగా నటించలేక పోతే రీటెక్స్ ఎక్కువగా తీసుకోవాల్సిన వస్తుంది.
ఎన్నిసార్లు చెప్పినా కావలసినట్టు నటించలేక పోతే దర్శకుడు వారిని తీసేయక తప్పదు.వారి స్థానంలో వేరొకరిని తీసుకోవడానికి దర్శకులు ఏమాత్రం వెనకాడరు.
వాస్తవానికి ఇలాంటి సిచువేషన్స్ టాలీవుడ్ డైరెక్టర్లకు కూడా ఎదురవుతుంటాయి.ఆ సిచువేషన్ ఎదురైన కొంతమంది తెలుగు డైరెక్టర్లు యాక్టర్స్‌ను మధ్యలోనే తీసేశారు.
వారి స్థానంలో వేరే వారిని తీసుకున్నారు.ఆ దర్శకులు, నటులు ఎవరో తెలుసుకుందాం.
• వర్షం – విలన్ క్యారెక్టర్
రొమాంటిక్ యాక్షన్ ఫిలిం ‘వర్షం’ ( Varsham ) ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.ఈ మూవీ ఒక్కసారి చూసినా చాలు ఇందులోని ప్రతి క్యారెక్టర్ బాగా గుర్తుండిపోతుంది.
ముఖ్యంగా “భద్రన్న” అనే విలన్ రోల్ బాగా మెప్పించింది.ఈ పాత్రను గోపీచంద్ ( Gopichand ) పోషించాడు.
కానీ గోపీచంద్ కంటే ముందు ఈ క్యారెక్టర్ వేరొకరికి ఇచ్చారు.అయితే ఆ నటుడు సరిగా యాక్ట్ చేయలేకపోయాడు.
దీంతో ఈ మూవీ డైరెక్టర్ శోభన్ అతని ప్లేస్‌లో గోపీచంద్‌ని తీసుకున్నారు.ఒక ప్రమాదకరమైన, క్రూరమైన రాజకీయ నాయకుడిగా గోపీచంద్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడు.
అంతేకాదు హీరోయిన్ని ప్రేమించే లవర్ బాయ్‌గానూ చక్కని వేరియేషన్స్ చూపించాడు.
• ఉప్పెన – హీరోయిన్
ఉప్పెన( Uppena ) సినిమాతోనే తెలుగు సినిమాకి చాలామంది పరిచయమయ్యారు.డైరెక్టర్ బుచ్చిబాబుకి ఇదే ఫస్ట్ మూవీ.అంతేకాదు హీరో, హీరోయిన్‌కి కూడా తొలి తెలుగు మూవీ అయ్యింది.
ఇందులో బేబమ్మ (సంగీత) క్యారెక్టర్ సూపర్ హిట్ అయింది.ఈ సినిమా రిలీజ్ అయిన చాలా కాలం వరకు బేబమ్మ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నారు.
ఈ పాత్రను మంగళూరుకు చెందిన కృతి శెట్టి పోషించింది కానీ ఈ ముద్దుగుమ్మ కంటే ముందు ఇద్దరు హీరోయిన్లను బుచ్చిబాబు సనా తీసుకున్నాడు.ఉప్పెన ఫిలిం లాంచ్ ఈవెంట్లో నటి మనీషా రాజ్‌ని( Manisha Raj ) హీరోయిన్గా ప్రకటించాడు.
కానీ ఆమె బేబమ్మ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తుందని బుచ్చిబాబు కన్విన్స్ కాలేకపోయాడు.అందుకే మరో డెబ్యూ యాక్ట్రెస్ అయిన దేవికా సంజయ్‌ని( Devika Sanjay ) సంప్రదించాడు.
ఆమె కూడా ఆ పాత్రకు న్యాయం చేస్తుందనే నమ్మకం బుచ్చిబాబుకు కలగలేదు.చివరికి కృతి శెట్టిని తీసుకున్నాడు.ఈ ముద్దుగుమ్మ వైష్ణవ్ తేజ్ పక్కన పర్ఫెక్ట్గా సూట్ అయింది.అంతే కాదు చాలా బాగా నటించింది.
• అమ్మోరు – ప్రతి నాయకుడు
హిందూ మైథాలజికల్ ఫాంటసీ ఫిల్మ్ అమ్మోరు (1995)( Ammoru ) బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గోపాలకృష్ణ అలియాస్ “గోరఖ్”గా రామి రెడ్డి అద్భుతంగా నటించాడు.ఇది ఒక విలన్ పాత్ర.అయితే ఈ పాత్రను ముందుగా “రాత్రి” మూవీ ఫేమ్ చిన్నతో( Chinna ) చేయించారు.సంవత్సరం పాటు షూటింగ్ అయిపోయాక ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఔట్పుట్ అసలు నచ్చలేదు.అందుకే అతన్ని తీసేసి రామిరెడ్డిని ఎంపిక చేసుకున్నారు.