వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!

కొంతమంది భార్యపై ప్రేమను చూపించడానికి ఎంత కష్టమైనా భరిస్తారు.తాజాగా అలాంటి చైనీస్ వ్యక్తికి( Chinese ) సంబంధించిన ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 Chinese Man Takes 320 Km Commute Each Day To Be With Wife Details, Lin Shu, 31-y-TeluguStop.com

అతడి వయసు 31 ఏళ్లు.పేరు లిన్ షు.( Lin Shu ) లిన్ కొత్తగా పెళ్లి చేసుకున్నాడు.సాధారణంగా కొత్తగా పెళ్లయినప్పుడు చాలా మంది వర్క్/ ఆఫీస్ దగ్గరగా ఉండేలా చూసుకుంటారు.

తద్వారా టైమ్‌ వేస్ట్ చేసుకోరు.ప్రయాణం తగ్గించుకుని ఎక్కువ సమయం భాగస్వామితోనే గడుపుతారు.

కానీ లిన్ షు వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు.అతడు ఆఫీసు దూరంగా ఉంటుంది.

అయినా ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

రోజూ 320 కి.మీ ప్రయాణిస్తూ వర్క్ చేస్తున్నాడు.భార్యతో కలిసి ఉండటానికి ఇంత కష్టాన్ని భరిస్తున్నాడు.

లిన్ షు స్టోరీ ఆన్‌లైన్‌లో బాగా పాపులర్ అయింది.తన సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వెబ్‌సైట్ డౌయిన్‌లో( Douyin ) షేర్ చేస్తూ “ఇది అత్యంత దూర ప్రయాణం” అని అతడు క్యాప్షన్ జోడించాడు.

లిన్ షు రోజు చాలా ముందుగానే ప్రారంభమవుతుంది.ఈయన షాండోంగ్ ప్రావిన్స్‌లోని( Shandong Province ) వీఫాంగ్‌లో నివసిస్తున్నాడు.ఉదయం 5 గంటలకు లేస్తాడు.5:20 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి, 30 నిమిషాల పాటు ఎలక్ట్రిక్ సైకిల్‌పై స్టేషన్‌కు వెళ్తాడు.6:15 గంటలకు రైలు ఎక్కుతాడు.7:46 గంటలకు షాండోంగ్‌లోని కింగ్‌డావో ( Qingdao ) చేరుకుంటాడు.అక్కడి నుంచి 15 నిమిషాల సబ్‌వే ప్రయాణం ద్వారా తన ఆఫీసుకు చేరుకుంటాడు.

Telugu China, Douyin, Haier, Lin Shu, Lin Shu Story, Newly Married, Nri, Qingdao

ఉదయం 9 గంటలకు పని ప్రారంభించే ముందు లిన్ షు తన కంపెనీ క్యాంటీన్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు.పని ముగిసిన తర్వాత, కింగ్‌డావో, వీఫాంగ్ మధ్య 160 కి.మీ దూరాన్ని కవర్ చేస్తూ 3 నుండి 4 గంటల ప్రయాణం ద్వారా ఇంటికి తిరిగి వెళ్తాడు.రోజూ లిన్ షు చాలా సమయం ప్రయాణిస్తాడని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.లిన్ “ప్రేమ కారణంగా” ఇది విలువైనదే అని చెబుతాడు.లిన్ రోజూ ప్రయాణానికి 1,600 యువాన్ (సుమారు రూ.18,000) ఖర్చు చేస్తాడు.

Telugu China, Douyin, Haier, Lin Shu, Lin Shu Story, Newly Married, Nri, Qingdao

మేలో పెళ్లి చేసుకునే ముందు, లిన్, అతని భార్య ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు.అతని భార్య వీఫాంగ్‌కి( Weifang ) చెందినది, అక్కడ వారు ఆమెకు భద్రతా భావాన్ని కలిగించడానికి ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు.లిన్ గతంలో తన పని ప్రదేశానికి దగ్గరలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నాడు, కానీ కింగ్‌డావోలో అద్దె ఎక్కువగా ఉండటం వల్ల ఈ లాంగ్ జర్నీని ఎంచుకున్నాడు.

అతను బాగా పేరున్న చైనీస్ కంపెనీ అయిన హైయర్‌లో పనిచేస్తున్నాడు.

తన భార్య కింగ్‌డావోలో ఉద్యోగం కోసం వెతుకుతుందని, తన ప్రయాణం తాత్కాలికమేనని, ఆమెకు ఉద్యోగం దొరికితే అక్కడికి వెళ్లాలని యోచిస్తున్నట్లు అతను చెప్పాడు.మొత్తం మీద వీరి స్టోరీ బాగా హైలైట్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube