బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్( Aamir Khan ) ఆయన మాజీ భార్య కిరణ్ రావు( Kiran Rao ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అమీర్ ఖాన్ భారీగానే కాకుండా దర్శకురాలిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది కిరణ్ రావు.
అయితే పెళ్లి తర్వాత నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇటీవల అనగా పెళ్లి అయిన 16 ఏళ్లకు విడాకులు( Divorce ) తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.అప్పట్లో ఈ విషయం బాలీవుడ్ లో సంచలనంగా మారింది.
అయితే విడాకులు తీసుకున్నప్పటికీ పిల్లల కోసం వీళ్ళు తరచుగా కలుస్తూనే ఉన్నారు.ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా చాలాసార్లు వైరల్ అయ్యాయి.

అయితే వీరి విడాకుల విషయంపై సోషల్ మీడియాలో అనేకసార్లు నేటిజన్స్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.విడాకులు ఎందుకు తీసుకున్నారు అందుకు గల కారణాలు ఏమిటి అనేది విషయంపై అటు అమీర్ ఖాన్ కి అలాగే ఇటు కిరణ్ రావు కి అనేక సార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి.చాలా సందర్భాలలో ఆ ప్రశ్నలు వీళ్లు స్కిప్ చేస్తూనే వచ్చారు.అయితే తాజాగా విడాకులు తీసుకోవడంపై స్పందించింది కిరణ్ రావు.ఈ మేరకు ఆమె ఈ విషయంపై మాట్లాడుతూ.సంబంధాలు ఎప్పటికప్పుడు పునర్నిర్వచించబడాలని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే, మనం పెరిగేకొద్దీ మనుషులుగా మారతాము.

సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నప్పుడు ఎమోషనల్ గా, మానసికంగా దానిని తట్టుకోవడానికి కాస్త సమయం పట్టింది.విడాకుల తర్వాత సంతోషంగా ఉంటాననుకున్నాను.అనుకున్నదే జరిగింది.
ఆమిర్ నా జీవితంలోకి రావడానికి ముందు చాలా ఏళ్లు సింగిల్గానే ఉన్నాను.నా స్వతంత్రతను ఎంజాయ్ చేశాను.
కాకపోతే అప్పట్లో కొన్నిసార్లు ఒంటరిగా ఫీలయ్యాను.కానీ ఇప్పుడు అలా కాదు.
నా కొడుకు ఆజాద్( Azad ) ఉండటంతో ఒంటరితనం నా దరి చేరదు.ఇరు కుటుంబాల నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది.
ఆమిర్ తో ఇప్పటికీ నాకు మంచి అనుబంధం ఉంది అని తెలిపారు కిరణ్ రావు. తాజాగా ఈమె చేసిన వాక్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







