చింతపండు( Tamarind ).దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.
తీపి, పులుపు రుచులను కలగలిసి ఉండే చింతపండును వంటల్లో విరివిరిగా వాడుతుంటారు.చింతపండులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యానికి చింతపండు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా చింతపండు జ్యూస్ ను డైట్ లో కనుక చేర్చుకుంటే మతిపోయే ఆరోగ్య లాభాలు మీసొంతం అవుతాయి.
పైగా చింతపండు జ్యూస్( Tamarind juice ) తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయంత గింజ తొలగించిన చింతపండును వేసి ఒక చిన్న కప్పు వాటర్ పోసి గంట పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న చింతపండును వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే మరో కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించడమే.
ఈ చింతపండు జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ జ్యూస్ లో రిచ్ గా ఉండే విటమిన్ సి( Vitamin C ) బలమైన రోగనిరోధక వ్యవస్థను, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.అలాగే చింతపండు జ్యూస్ లో పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.క్యాన్సర్‌తో సహా పలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చింతపండు జ్యూస్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది.మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.
చింతపండు జ్యూస్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి.ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అంతేకాదు, చింతపండు జ్యూస్ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.మలబద్ధకాన్ని తరిమి కొడుతుంది.
మరియు మొత్తం జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.