అయోధ్య( Ayodhya )లో తొలిసారి శ్రీరామనవమి వేడుకలు( Sri Ramanavami ) జరుగుతున్నాయి.బాలరాముడి ప్రాణప్రతిష్ట తరువాత నిర్వహించే ఈ పండుగను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు.
శ్రీరామనవమిని పురస్కరించుకుని రాముడి దర్శనం కోసం భక్తులు( Devotees ) పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ క్రమంలో ముందుగా బాల రాముడికి పంచామృతంతో అభిషేకం చేశారు.
పంచామృతాలతో అభిషేకం తరువాత శ్రీరాముడి( Lord rama )ని అలంకరించి.హారతి ఇచ్చారు.ఈ సేవలన్నీ పూర్తయిన తరువాత ఆయన భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ నవమి సందర్భంగా స్వామివారు పసుపు రంగు దుస్తుల్లో దర్శనమిస్తున్నారు.అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు శ్రీరాముడి నుదుటిపై పడనున్నాయి.నాలుగు నిమిషాల పాటు బాలరాముడి( Ayodhya Ram ) నుదుటిపై కిరణాలు ప్రసరించనున్నాయి.
భక్తులు సూర్యతిలకం వీక్షించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.