ముఖ్యంగా చెప్పాలంటే వేసవికాలం( Summer Season ) మొదలవగానే అధిక నీరు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం కొన్ని రకాల పండ్లను మరియు వాటితో తయారుచేసిన జ్యూస్లను తగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఎందుకంటే ఆ జ్యూస్ ల వల్ల వారి శరీరంలో ఇన్సులిన్ రేటు పెరిగి మధుమేహం( Diabetes ) మరింత పెరుగుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు.కాబట్టి అలాంటి వారి కోసం కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ తో దుష్ప్రభావాలు కలగకుండా వారి ఎండ తాపాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరి ఆ జ్యూస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఎండాకాలం అంటేనే మనకు గుర్తొచ్చేది బటర్ మిల్క్( Butter Milk ) ఇందులో ఉన్న అధిక ఫైబర్ కంటెంట్ మధు మేహ వ్యాధిగ్రస్తులకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది.అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా బట్టర్ మిల్క్ ను తీసుకోవచ్చు.
ఇంకా చెప్పాలంటే నిమ్మరసం షర్బత్ చేసుకోవడానికి పంచదారని ఉపయోగిస్తూ ఉంటారు.దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు శరీరంలో షుగర్ ఇంకా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
కాబట్టి వీరికి నిమ్మరసం లో పంచదారకు బదులుగా తేనె కలిపి ఇవ్వడం వల్ల వారి శరీరంలోని వేడి తాపం తగ్గడమే కాకుండా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.
అలాగే మధుమేహం వ్యాధిగ్రస్తులు కాన్ బెర్రీ జ్యూస్( Canberry Juice ) లు ఎండాకాలంలో అధికంగా తీసుకోవడం వల్ల, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆంటీ ఇన్ఫ్లమేటరి గుణాల వల్ల మధుమేహం అదుపులో ఉండడమే కాకుండా వేసవి తాపం కూడా తొందరగా తగ్గిపోతుంది.ఇక అంతే కాకుండా చియా సీడ్స్( Chia Seeds ) ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే నిమ్మరసం మరియు తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరం మాశ్చరైజ్ గా, ఆరోగ్యవంతంగా ఉంటుంది.అలాగే పైనాపిల్ జ్యూస్ తయారు చేస్తున్నప్పుడు స్వీట్నర్ గా పంచదార బదులుగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
పైనాపిల్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి శరీరం హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.