వేసవి కాలం( Summer ) ప్రారంభం అయింది.ఎండలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి.
వేసవిలో అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో డీహైడ్రేషన్ ఒకటి.వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో నీటి శాతం పడిపోతుంది.
దాంతో నీరసం, అలసట, కళ్లు తిరగడం, మూర్చ, విపరీతమైన తలనొప్పి, నోరు పెదాలు ఎండిపోవడం తదితర సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.అందుకే వేసవిలో బాడీని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
ఈ నేపథ్యంలోనే వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండడానికి పుచ్చకాయతో సహా తినదగ్గ ఉత్తమ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పుచ్చకాయ.
సమ్మర్ ఫ్రూట్స్ లో ఇది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.నిత్యం ఒక కప్పు పుచ్చకాయను తీసుకోవడం వల్ల బాడీ లో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది.
పుచ్చకాయ( Watermelon )లో ఎక్కువగా నీరు ఉంటుంది.అలాగే అవసరమైన పోషకాలను మరియు తగినంత కేలరీలను అందిస్తూనే, అనారోగ్యకరమైన చిరుతిళ్లను నివారించడంలో పుచ్చకాయ సహాయపడుతుంది.
వేసవికాలంలో మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి బొప్పాయి పండు( Papaya fruit ) కూడా చాలా బాగా సహాయపడుతుంది.బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ వంటి పోషకాలతో పాటు వాటర్ కంటెంట్ కూడా మెండుగా ఉంటుంది.బొప్పాయి పండును తీసుకోవడం వల్ల వేసవిలో ఇబ్బంది పెట్టే రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చు.
వేసవిలో విరివిరిగా లభించే పండ్లలో కర్బూజ( Muskmelon ) ఒకటి.తియ్యటి రుచిని కలిగి ఉండే ఈ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కర్పూజా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.కాబట్టి ఈ వేసవి కాలంలో కర్బూజ తప్పకుండా తింటూ ఉండండి.
పైగా కర్బూజ అధిక బరువును నియంత్రిస్తుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.
ఒత్తిడిని దూరం చేస్తుంది.మరియు కంటి ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.
ఇక వేసవి కాలంలో మామిడి పండ్లు, స్ట్రాబెర్రీలు కూడా మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి.కాబట్టి తప్పకుండా వీటిని ఆహారంలో భాగం చేసుకోండి.