తమ స్పాన్సర్‌లు ఉపాధి కల్పించడంలో విఫలమవ్వడంతో యూకేలో( UK ) కొందరు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులు ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనిలో భాగంగా తమకు ఉద్యోగాన్ని వెతుక్కునేందుకు సమయం కేటాయించాలని యూకే ప్రభుత్వాన్ని కోరుతూ జారీ చేసిన ఆన్‌లైన్ పిటిషన్‌కు( Online Petition ) మద్ధతు పెరుగుతోంది.
కొద్దిరోజుల్లోనే వందలాది మంది దీనిపై సంతకాలు చేశారు.ఈ నెల ప్రారంభంలో అమల్లోకి వచ్చిన కఠినమైన నిబంధనల ప్రకారం.
వలసదారులకు స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్‌లోని కేర్ ప్రొవైడర్లు .కేర్ క్వాలిటీ కమీషన్ (సీక్యూసీ)( CQC ) హెల్త్ అండ్ సోషల్ కేర్ కోసం ఇండస్ట్రీ రెగ్యులేటరీలో నమోదు చేసుకోవాలి.
దీని వల్ల భారత్ వంటి దేశాలకు చెందిన అమాయక కార్మికులు తమ లైసెన్సును కోల్పోయినప్పుడు .వెంటనే మరో ఉపాధిని వెతుక్కోవడానికి కేవలం 60 రోజుల గడువు మాత్రమే వుంటుంది.ఈ దుస్థితిపై ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించిన బాలకృష్ణన్ బాలగోపాల్( Balakrishnan Balagopal ) మాట్లాడుతూ.ఒక కుటుంబం నిష్క్రమణ ఏర్పాట్లు చేసుకోవడానికి 60 రోజులు చిన్న నోటీసుగా పేర్కొన్నారు.
ఇది వారి పిల్లలపై ప్రభావం చూపడంతో పాటు అద్దె లేదా డిపాజిట్, ఫర్నిషింగ్ ఖర్చులు, విమాన టిక్కెట్లు , పునరావాస ఖర్చులను కోల్పోయేలా చేస్తుందన్నారు.
యూకేకు వచ్చిన హెల్త్ కేర్ వర్కర్లు( Health Care Workers ) తమ స్పాన్సర్‌లు వారికి ఉద్యోగాన్ని అందించలేకపోవడం, వారు యూకేలో అడుగుపెట్టిన సమయంలో ఉద్యోగం లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొన్ని సంస్థలు తమ స్వంత పొరపాట్ల కారణంగా స్పాన్సర్ చేయడానికి తమ లైసెన్స్‌ను సైతం కోల్పోతాయి.ఉద్యోగాలు లేని ఆరోగ్య కార్యకర్తలు మరొక ఉద్యోగం దొరికేవరకు యూకేలో ఏడాది పాటు వుండేందుకు అనుమతించాలని పిటిషన్‌లో కోరారు.గత వీకెండ్‌లో యూకే పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ఈ పిటిషన్ ప్రారంభించారు.10 వేల సంతకాలు దాటిన తర్వాత ప్రభుత్వం స్పందించాల్సి వుంటుంది.గణాంకాల ప్రకారం.యూకే ఆరోగ్య సంరక్షణ రంగంలో సిబ్బంది కొరతను తీర్చడానికి గాను 1,40,000 వీసాలను జారీ చేశారు.వీరిలో 39,000 మంది భారతీయులే.