శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో రిషబ్ శెట్టి( Rishab Shetty ) ఒకరు.రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2 సినిమా( Kantara 2 ) పనులతో బిజీగా ఉన్నారు.
సినిమాల్లోకి రావడానికి ముందు రిషబ్ శెట్టి అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు.సినిమాల్లోకి రావడం కంటే ముందే రిషబ్ శెట్టి కొన్ని ఉద్యోగాలు చేశారు.
నా అవసరాల కోసం తల్లీదండ్రులను ఎప్పుడూ డబ్బు అడగలేదని చెప్పుకొచ్చారు.
మొదట నేను క్లాప్ బాయ్ గా పని చేశానని ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా( Assistant Director ) పని చేశానని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.
నేను యాక్టర్ కావాలని అనుకున్నానని కానీ ఇండస్ట్రీలో ఎలాంటి పరిచయాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.ఆ సమయంలో ఎలా అప్రోచ్ కావాలో కూడా నాకు తెలియదని రిషబ్ శెట్టి వెల్లడించారు.
ఒక కన్నడ నటుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా ఎలా మారాడో చదివానని ఆయన పేర్కొన్నారు.
ఫిల్మ్ మేకింగ్( Film Making ) గురించి నేను షార్ట్ టర్మ్ కోర్సు కూడా చేశానని రిషబ్ శెట్టి వెల్లడించడం గమనార్హం.డిగ్రీ చదివే సమయంలో డబ్బులు లేక కూలి పనులకు కూడా వెళ్లానని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.మొదటి సినిమా డైరెక్షన్ చేసేవరకు వాటర్ క్యాన్స్ అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్ లో పని చేయడం చేశానని ఆయన కామెంట్లు చేశారు.
చదువుకునే సమయంలో సినిమాలో ఆఫర్ల కోసం ప్రయత్నించానని రిషబ్ శెట్టి తెలిపారు. తుగ్లక్ అనే సినిమాలో నేను మొదట నటించానని రిషబ్ శెట్టి పేర్కొన్నారు.రిషబ్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన రికీ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.రిషబ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కిరిక్ పార్టీ( Kirik Party ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.