Mahashivaratri : మహాశివరాత్రి జాతరకు 1500 మంది సిబ్బందితో పటిష్ట భద్రత : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి( Vemulawada Sri Rajarajeswari Swamy ) పుణ్యక్షేత్రంలో ఈ నెల 07,08,09 తేదీల్లో నిర్వహించబోయే మహాశివరాత్రి జాతరకు వివిధ జిల్లాల నుంచి బందోబస్తూకు వచ్చిన పోలీసు సిబ్బందికి వేములవాడ పట్టణంలోని మహారాజా ఫంక్షన్ హాల్( Maharaja Function Hall ) లో విధుల నిర్వహణపై దిశ నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….

 Mahashivaratri Tight Security With 1500 Personnel For Mahashivaratri Fair Distr-TeluguStop.com

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది.బందోబస్తుని 7 సెక్టార్స్ గా విభజించి మూడు షిప్టు ల పద్దతిన విధులు కేటాయించడం జరిగింది.
ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికివచ్చే భక్తులకు పోలీస్ సిబ్బంది ఓపికతో సలహాలు,సూచనలు ఇవ్వాలన్నారు.జాతరకు వచ్చే భక్తుల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలని,ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.

దేవస్థానం వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి భక్తులు క్యూ లైన్ పాటించేలా చూడాలని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 24 గంటలు పోలీస్ నిఘా ఉంచాలని,ఏదైనా ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూంకు తెలియజేయాలన్నారు.
ఎక్కడాఎలాంటి ఇబ్బందులు వచ్చిన ఎదుర్కొనేలా స్పెషల్ పోలీస్ బృందాలు( Special Police Team ) సిద్ధంగా ఉన్నాయని,ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతమైన వాతావరణంలో శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని క్షేమంగా తిరిగి వెళ్లేవిధంగా ప్రతి పోలీస్ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు.

శ్రీ రాజరాజేశ్వర అలయాలతో పాటు అనుబంధ ఆలయాలు అయిన భీమేశ్వర, నగరేశ్వర,కేదారేశ్వర, బద్దీపోచమ్మ,నాంపెల్లి, అగ్రహారం దేవాలయాల వద్ద బందోబస్తు ఉంటుందన్నారు.భక్తజన సందోహం ఉన్నచోట దొంగతనాలు,చైన్ స్నాచింగ్ ఇతరనేరాలు జరుగకుండా అరికట్టేందుకు క్రైమ్ పార్టీలు నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

జాతరలో మహిళా రక్షణార్ధం షీ టీం బృందాలు కూడా సివిల్ డ్రెస్ లలో విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపడితే అధికారులకు తెలియజేయాలన్నారు.

జాతరకు భారీ సంఖ్యలో వచ్చే వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసేలా చూడాలన్నారు.ట్రాఫిక్ విధుల్లో ఉన్న సిబ్బంది ట్రాఫిక్ జామ్ అవకుండా నియంత్రణ చేయాలని,జాతరకు వచ్చేవాహనాల ద్వారా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ లు అన్ని ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, రాత్రి వేళలో ప్రమాదాలు జరగకుండా స్టాపర్స్, కోన్స్, స్టిక్కర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి,డిఎస్పీ నాగేంద్రచారి, చంద్రశేఖర్ రెడ్డి,సర్వర్,సి.

ఐ లు ,ఎస్.ఐ లు వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube