Superstar Krishna : దిగ్గజాలను తట్టుకొని కృష్ణ కోసమే సృష్టించబడిన ఏకైక సినిమా ఇదే !

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) నటించిన మొత్తం సినిమాల్లో ఉత్తమ సినిమా “అల్లూరి సీతారామరాజు” అని చెప్పుకోవచ్చు.ఈ మూవీలో కృష్ణ అద్భుతంగా నటించాడు.

 Interesting Facts About Krishna Alluri Seetarama Raju Movie-TeluguStop.com

నిజంగా అల్లూరి సీతారామరాజు ఇలాగే ఉంటాడేమో అనిపించేంతలా ఆయన ఆ పాత్రలో జీవించేసాడు.ఒక్కో డైలాగ్ కృష్ణ నోటిలో నుంచి బయటికి వస్తుంటే అవి తూటాల్లాగా వినిపించాయంటే అతిశయోక్తి కాదు.ఈ మూవీ టీవీలో వస్తే ఇప్పటికీ స్క్రీన్లకు అతుక్కుపోయి చూసేవారు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.1974, మే 1న ‘అల్లూరి సీతారామరాజు’( Alluri Seetaramaraju ) విడుదలై 175 రోజులు నడిచింది.ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.


-Movie

ఇది కృష్ణ కెరీర్‌లో 100వ సినిమా కావడం విశేషం.ఈ బుర్రిపాలెం బుల్లోడు జస్ట్ 9 ఏళ్లలోనే 100 సినిమాలు పూర్తి చేసి వావ్ అనిపించాడు.నిజానికి కృష్ణ 1968లోనే “అసాధ్యుడు”( Asadhyudu ) మూవీలోని ఓ నాటకంలో అల్లూరి సీతారామరాజు వేషంలో మెప్పించాడు.

ఆ క్యారెక్టర్ వేసుకున్నప్పుడు కృష్ణకి చాలా గొప్పగా అనిపించిందట.ఆ పాత్రను ఫుల్ లెన్త్ చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాడట.వాస్తవానికి దీనికంటే ముందే అంటే 1958లో “ఆలుమగలు” మూవీలో జగ్గయ్య అల్లూరిగా చేసిన నటన చూసి కృష్ణకి ఆ పాత్ర చేయాలనే కోరిక మొదలయ్యిందట.మరోవైపు పాత తరం డైరెక్టర్ తాతినేని ప్రకాశరావు ఏఎన్ఆర్‌ను హీరోగా పెట్టి “అల్లూరి సీతారామరాజు” బయోపిక్‌ను తియ్యాలని భావించాడట.

అనుకోని కారణాలవల్ల అతను ఆ మూవీ తీయలేకపోయాడు.సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) కూడా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా చేద్దామనుకున్నాడట.

అంతేకాదు ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుతో స్క్రిప్టు కూడా రెడీ చేయించాడట.కానీ ఎన్టీఆర్ ప్రయత్నాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి.

శోభన్‌బాబు( Shobhan Babu ) కూడా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర తో సినిమా చేద్దామని అనుకున్నాడు కానీ ఆయనకు కూడా అది కుదరలేదు.

-Movie

వీరందరి ప్రయత్నాలు విఫలమైనా కృష్ణ ప్రయత్నాలు మాత్రం సాధ్యమయ్యే దిశగా సాగాయి.ఆ బయోపిక్ ను చేసే అదృష్టం కేవలం కృష్ణకు మాత్రమే ఉందనేలా అన్నీ కలిసి వచ్చాయి.సూపర్ స్టార్ కృష్ణ దిగ్గజ రచయిత త్రిపురనేని మహారథిని కలిసి “అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రతో సినిమా చేద్దామనుకుంటున్నా.

నువ్వు స్క్రిప్ట్ తయారు చేయాలి” అని విజ్ఞప్తి చేశాడు.దానికి వెంటనే ఒప్పుకున్న మహారథి అంతకుముందు ఒప్పుకున్న సినిమా ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నాడు.విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి సమగ్రమైన రీసెర్చ్ చేసి ఖచ్చితమైన స్క్రిప్ట్ సిద్ధం చేశాడు.దానిని డైరెక్టర్ వి.రామచంద్రరావు డైరెక్ట్ చేయడం ప్రారంభించాడు.అయితే ఆయన ‘అల్లూరి సీతారామరాజు’( Alluri Seetaramaraju Biopic ) షూటింగ్ చేస్తుండగానే చనిపోయాడు.

మిగతా షూటింగ్ కృష్ణ నే పూర్తి చేసి బంపర్ హిట్ అందుకున్నాడు.అంతేకాదు ఆ పాత్ర అద్భుతంగా పోషించే విమర్శకుల చేత ప్రశంసలు పొందాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube