Samantha : బాత్రూంలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత.. అలాంటి కామెంట్ చేసిన జుకాల్కర్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ఇన్ని రోజులపాటు అనారోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా అనారోగ్యానికి గురైనటువంటి సమంత ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ స్థితికి వస్తున్నారని తెలుస్తుంది.

 Preetham Jukalker Response On Actress Samantha Shared Photos-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు ప్రస్తుతం సంచలనంగా మారాయి.ఈమె పూర్తిగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్నారని తాజాగా ఆమె షేర్ చేసే ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.

సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని సమంత తాజాగా బాత్రూంలో దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.దీనితో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇందులో భాగంగా వైట్ కలర్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ వేసి వివిధ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగారు.ఇక ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అన్‌బాదర్డ్ అని పేర్కొంది.

బాత్‌ రూమ్‌లో( Bathroom ) ఉన్నా, తనకు ఇబ్బంది లేదని, ఇబ్బంది పడను అంటూ పేర్కొంది.దీనికి నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రముఖ డిజైనర్ ప్రీతమ్ జుకాల్కర్ ( Preetham Jukalkar ) ఈ ఫోటోలపై స్పందించారు.ఇక ఈ ఫోటోలపై ఆయన స్పందిస్తూ వైట్ కలర్ లవ్ సింబల్స్ షేర్ చేశారు.

మరో నెటిజన్ స్పందిస్తూ ఫైరింగ్‌ ఎమోజీని షేర్‌ చేస్తూ ఉఫ్‌ అంటూ పోస్ట్ పెట్టాడు.దీనికి సమంత రియాక్ట్ కావడం విశేషం.ఆ నెటిజన్‌కి యూ లవ్‌ అంటూ పేర్కొంది.

ప్రస్తుతం సమంత షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.ఇక సమంత అనారోగ్యం నుంచి పూర్తిగా కోరుకుందని త్వరలోనే ఈమె గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఈ ఫోటోలు చూస్తేనే స్పష్టంగా అర్థం అవుతుంది.ఇక ఈమె చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా( Kushi ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.ఇక ప్రస్తుతం అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకున్నటువంటి ఈమె త్వరలోనే ఇండస్ట్రీలోకి నటిగాను నిర్మాతగా కూడా అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube