Ashish Vidyarthi Pokiri : పోకిరి లో ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్( Puri Jagannath ) లాంటి దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను అందించడమే కాకుండా ప్రతి ఒక్క హీరోకు సపరేట్ క్యారెక్టరైజేశన్ ను ఇచ్చిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్.

 Tollywood Star Hero Who Missed Ashish Vidyarthi Character In Pokiri Movie-TeluguStop.com

హీరోలు పూరి సినిమాలో నటించక ముందు, నటించిన తర్వాత అనేంతలా వాళ్ళని వాళ్ళు చాలా వరకు మార్చుకుంటారు.ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్క హీరో కి పూరీ సపరేట్ క్యారెక్టరైజేశన్ ఇవ్వడం వల్లే వాళ్ళు అంత రేంజ్ లోకి వెళ్లారనే విషయం అందరికి తెలిసిందే…

Telugu Saikumar, Ashishvidyarthi, Puri Jagannath, Mahesh Babu, Pashupati Role, P

ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో( Mahesh Babu ) చేసిన పోకిరి సినిమాలో( Pokiri Movie ) ఆశిష్ విద్యార్థి( Ashish Vidyarthi ) పశుపతి అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించాడు.ఆ పాత్రలో మొదట తెలుగు స్టార్ హీరో అయిన సాయికుమార్ ని( Sai Kumar ) తీసుకోవాలని పూరి జగన్నాథ్ అనుకున్నారట.కానీ అప్పటిదాకా హీరోగా చేసిన సాయి కుమార్ అది నెగిటివ్ క్యారెక్టర్ కావడం తో దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట.

 Tollywood Star Hero Who Missed Ashish Vidyarthi Character In Pokiri Movie-Ashis-TeluguStop.com

దాంతో పూరి ఆ క్యారెక్టర్ లో ఆశిష్ విద్యార్థిని తీసుకున్నాడు.ఈ క్యారెక్టర్ లో ఆశిష్ విద్యార్థి ఒక కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ గా తనదైన రీతిలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Telugu Saikumar, Ashishvidyarthi, Puri Jagannath, Mahesh Babu, Pashupati Role, P

ఒకవేళ సాయికుమార్ కనక ఆ పాత్రలో నటించినట్లయితే సాయి కుమార్ కెరియర్ కి చాలా బాగా హెల్ప్ అయ్యేది.విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయనకు విపరీతమైన డిమాండ్ పెరిగేదని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.ఎందుకంటే అప్పటివరకు సాయికుమార్ పోషించిన పాత్రలు వేరు, అలాంటి ఒక కన్నింగ్ క్యారెక్టర్ చేసి మెప్పించినట్టయితే ఆయనకి ఇండస్ట్రీలో బోలెడన్ని అవకాశాలు వచ్చిండేవి అని చాలా మంది ఆయన అభిమానులు కూడా అంటూ ఉంటారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube