తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీకి బయలుదేరారు.పర్యటనలో భాగంగా ఆయన రేపు పలువురు కేంద్రమంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్( Nirmala Sitharaman ) తో పాటు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కూడా ఆయన భేటీ కానున్నారు.అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను కలిసి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
వీటిలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం.కాగా సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు( Deputy CM Bhatti Vikramarka ) ఉన్నారు.అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.