Revanth Reddy : ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..!!
TeluguStop.com
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఢిల్లీకి బయలుదేరారు.
పర్యటనలో భాగంగా ఆయన రేపు పలువురు కేంద్రమంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్( Nirmala Sitharaman ) తో పాటు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కూడా ఆయన భేటీ కానున్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను కలిసి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
"""/" / వీటిలో ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం.
కాగా సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు( Deputy CM Bhatti Vikramarka ) ఉన్నారు.
అయితే త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎంత డబ్బు ఇచ్చిన పుష్ప లాంటి సినిమా చేయను…స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!