Muta Mestri : “ముఠా మేస్త్రి” సినిమాలోని ఆ సన్నివేశం ఎక్కడ కాపీ కొట్టారు ?

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి నటించిన “ముఠా మేస్త్రి( Muta Mestri )” సినిమాని కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశాడు.1993లో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా సినిమాలో చిరంజీవితో పాటు మీనా, రోజా, శరత్ సక్సేనా ప్రధాన పాత్రలు పోషించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.ఈ మూవీకి చిరంజీవి నటనే హైలైట్ అని చెప్పుకోవచ్చు.ఆయన అద్భుతమైన నటనకు గానూ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫెయిర్‌, సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు కూడా వచ్చాయి.

 Copied Cilmax From Muta Mestri Movie-TeluguStop.com
Telugu Cilmax, Meena, Muta Mestri, Roja, Trisha, Vishwambhara-Movie

ఒక ముఠాకి మేస్త్రిగా, చాలా సామాన్యుడిగా చిరంజీవి ఇందులో కనిపించాడు.ఆ సాధారణ వ్యక్తి స్థానం నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు.ఈ స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

కథకు తగినట్లు చిరంజీవి సామాన్యుడి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లే సన్నివేశాల్లో చాలా చక్కగా నటించాడు.కథ, కథనం, డైరెక్షన్ అన్నీ కూడా ఈ మూవీలో అద్భుతంగా ఉంటాయి.

ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది.ఇందులోని కోర్టు సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు.

ఈ సన్నివేశంలో కోర్టు పక్కన ఒక మసీదు ఉంటుంది.ఈ మసీదులో ఒక ముస్లిం నమాజ్ చేస్తూ ఉంటాడు.

దాన్నే సాక్ష్యంగా చూపుతూ దోషులకు శిక్ష వేయాలంటూ చిరంజీవి కోర్టులో బీభత్సంగా వాదించేస్తాడు.ఈ సీన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

అయితే ఈ సన్నివేశం మరో సినిమా నుంచి లిఫ్ట్ చేసేసారట.

Telugu Cilmax, Meena, Muta Mestri, Roja, Trisha, Vishwambhara-Movie

ఆ సన్నివేశం ఒక కొరియన్ సినిమాలోనిది అని అప్పట్లో కొంతమంది ఆరోపణలు చేశారు.అయితే ఆ సీన్‌ను ఉన్నది ఉన్నట్లు ముఠామేస్త్రి లో పెట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చారట.అయితే ఇది కాపీ కాదని మూవీ యూనిట్ ఖండించలేదు.

ఆ సీన్ కొరియన్ మూవీలో నుంచి తీసుకున్నారని వార్తలు మాత్రం గట్టిగానే వినిపించాయి.ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి హీరోగా వరస సినిమాలు తీసుకుంటూ వెళుతున్నాడు.

పోయిన సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ఒక హిట్ అందుకున్నాడు.ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్‌లో ‘విశ్వంభర( Vishwambhara ) ‘ మూవీ చేస్తున్నాడు.

దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ హిట్ అయితే మెగాస్టార్‌ మరికొన్ని సినిమాల్లో హీరోగా చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube