మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak Sen ) హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈయన త్వరలోనే గామి( Gaami ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీ విడుదలకు సిద్ధం అవుతుంది.ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి( Gaami Title Glimpse ) ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.ఇలా ఈ సినిమా విడుదల తేదీన ప్రకటిస్తూ చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వారణాసిలో( Varanasi ) ‘గామి’ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో ఫలక్ నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడినన్నారు.
ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డామని ముఖ్యంగా డైరెక్టర్ ప్రతి ఒక్క ఎలివేషన్ మంచిగా ఉండాలని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు.ఇక ఈ సినిమా షూటింగ్ వారణాసి లో జరుగుతున్న సమయంలో నేను అఘోర( Aghora ) పాత్రలో ఉన్నాను అయితే నేను నిజంగానే అఘోరానే అనుకుని కుంభమేళాలో ఒకరిద్దరు మహిళలు నాకు నిజంగానే డబ్బును ధర్మం చేశారు.వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూల కూర్చున్నప్పుడు ఓ ముసలామె భోజనం పెట్టి టీ ఇచ్చిందని షూటింగ్ సంఘటనలను ఈ సందర్భంగా విశ్వక్ గుర్తుచేసుకున్నారు.