తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వచ్చిన తరువాత నీళ్లు పోయాయని, కరెంట్ కూడా పోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి( Former Minister Jagadish Reddy ) అన్నారు.కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి కాంగ్రెస్ సర్కార్ ధారాదత్తం చేసిందని ఆరోపించారు.
ఇక సాగర్ ఆయకట్టు ఎండి పోతుందన్న జగదీశ్ రెడ్డి సాగర్ ఆయకట్టుకు వరుసగా 18 సార్లు నీళ్లు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ( BRS Party )దని తెలిపారు.కాంగ్రెస్ చేతకానితనంతో నల్గొండ ఎడారిగా మారుతుందని మండిపడ్డారు.
దీనికి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.పదేళ్లు కేంద్రం ఒత్తిడి చేసినా కేసీఆర్ తలొగ్గలేదని తెలిపారు.
నీటి హక్కుల్లో మన వాటా మనం సాధించాలన్న జగదీశ్ రెడ్డి తెలంగాణ హక్కులను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని వెల్లడించారు.