ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్( Hemant Soren ) ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లనున్నారు.ఈ మేరకు హేమంత్ సోరెన్ కు రాంచీ పీఎంఎల్ఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
భూ కుంభకోణం మరియు మనీ లాండరింగ్ కేసులో నిన్న హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు హేమంత్ సోరెన్ తో ఝార్ఖండ్( Jharkhand ) లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే అప్రమత్తం అయిన కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను రాంచీ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుందని తెలుస్తోంది.సుమారు 35 మంది ఇండియా కూటమి( India Alliance ) ఎమ్మెల్యేలు హైదరాబాద్( Hyderabad ) కు రానున్నారు.