టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) పద్మ విభూషణ్( Padma Vibhushan ) వరించిన విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి ఎన్నో మంచి మంచి సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును ప్రకటించింది.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.అయితే కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తుతూ ట్వీట్ చేయగా మరికొందరు ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి మరీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలంతా కూడా క్యూ కట్టారు.కుర్ర హీరోలు సైతం చిరంజీవి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అయితే చిరంజీవికి సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా( Tollywood Celebrities ) కూడా విషెస్ తెలిపారు.కానీ కానీ చాలామంది ఫిలంబిటిలో చిరంజీవికి ఈ అవార్డు రావడం పట్ల కనీసం విష్ చేయకపోవడం సంగతి పక్కన పెడితే ఆ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కూడా.చిరంజీవికి అంత గొప్ప అవార్డు వచ్చినా కూడా స్పందించని ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం… వారిలో ముందు వరుసలో బాలకృష్ణ( Balakrishna ) పేరు మొదటగా వినిపిస్తోంది.రజనీకాంత్( Rajinikanth ) కమలహాసన్( Kamal Haasan ) వంటి వారు కూడా ఈ విషయం పట్ల స్పందించకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.
అదే సమయంలో రాధిక, కుష్బూ వంటి వారు సోషల్ మీడియాలో స్పందిస్తు అభినందనలు తెలిపారు.బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) కూడా ఈ విషయంపై స్పందించలేదు.
మోహన్ లాల్( Mohan Lal ) కూడా చిరు పద్మ విభూషణ్ అవార్డుపై స్పందించలేదు.సినిమా ఇండస్ట్రీలో ఎవరి బర్త్ డేలు వచ్చినా, ఏదైనా ఇతర సందర్భాలున్నా కూడా చిరంజీవి వెంటనే స్పందిస్తారని, కానీ చిరుకు ఇంత గొప్ప పురస్కారం లభించినా ఏ ఒక్కరూ కూడా స్పందించలేదేంటి అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇంకొంతమంది మాత్రం స్పందన అంటే కేవలం ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాలోనే విషెస్ చేయాలా? పర్సనల్‌గా మెసెజ్ చేసి ఉండొచ్చు కాల్ చేసి మాట్లాడొచ్చు కదా? అని అనుకుంటున్నారు.మరి ఇందులో ఎంత మంది ఫోన్‌లు, మెసెజ్‌లు చేసి విషెస్ చేసి ఉంటారో అని అనుకుంటున్నారు.