Sri Ramulayya Movie: టైటానిక్ సినిమా తర్వాత అలాంటి ఒక రికార్డు శ్రీరాములయ్య సినిమా పేరు మీదే ఉంది అంటే నమ్ముతారా ?

ప్రపంచంలోకెల్లా అత్యద్భుతమైన ప్రేమ కథ ఏదైనా ఉంది అంటే అది సినిమాల పరంగా కేవలం టైటానిక్( Titanic Movie ) మాత్రమే అని అందరూ ముక్తకంఠంతో చెబుతారు.జేమ్స్ కామెరున్( James Cameron ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచంలో అన్ని చోట్ల అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.

 Most Unbelievable Record Of Mohan Babu Soundarya Sri Ramulayya Movie-TeluguStop.com

మన ఇండియాలో విషయానికి వస్తె తెలుగు లో కూడా అనేక సెంటర్స్ లో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది.

1997లో వచ్చిన ఈ సినిమా ప్రపంచంలోనే ఎంతో అందమైన ప్రేమ కథ అని అలాగే ప్రపంచ సినిమాను ఏకం చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1999లో మోహన్ బాబు హీరోగా శ్రీరాములయ్య అనే చిత్రం తెలుగులో వచ్చింది.

Telugu Akela Crane, Shankar, James Cameron, Mohan Babu, Nandamurihari, Soundarya

ఎన్కౌంటర్ శంకర్ దర్శకత్వంలో శ్రీరాములయ్య చిత్రం( Sri Ramulayya Movie ) టైటిల్ మోహన్ బాబు పోషించారు మోహన్ బాబు( Mohan Babu ) భార్య పాత్రలో సౌందర్య( Soundarya ) నటించగా నందమూరి హరికృష్ణ( Nandamuri Harikrishna ) కూడా ఒక ముఖ్యమైన పాత్రలో ఈ చిత్రంలో నటించాడు.అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే టైటానిక్ సినిమా కి ఉన్న ఒక రికార్డు ఆ తర్వాత తెలుగులోనే కాదు ప్రపంచంలోనే శ్రీరాములయ్య చిత్రానికి దక్కింది అంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది.టైటానిక్ సినిమాలో ప్రతి షార్ట్ ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు ఆ చిత్ర దర్శకుడు.

ఇక పడవ మునుగుతున్న సన్నివేశాలను చూస్తున్న ప్రతిక్షణం ప్రేక్షకుడికి ఉత్కంఠ కలుగుతుంది.షిప్ రెండుగా చీలి పై నుంచి కింది వరకు మునుగుతున్న షాట్ అయితే కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోతారు ఎవరైనా.

Telugu Akela Crane, Shankar, James Cameron, Mohan Babu, Nandamurihari, Soundarya

ఈ సన్నివేశాలు చిత్రీకరించడానికి జెమ్స్ కామెరూన్ అకెలా క్రేన్( Akela Crane ) అనే ఒక కొత్త టెక్నాలజీతో కూడిన క్రేన్ నీ ఉపయోగించి ఆ సీన్ చిత్రీకరించారు.ఈ సినిమా వచ్చిన రెండేళ్లకు అదే క్రేన్ వాడి సినిమా తీసిన రికార్డు శ్రీరాములయ్య చిత్రానికే దక్కుతుంది.హెలికాప్టర్ కు సదరు క్రేన్ ను కట్టి సినిమా మొదలైన సందర్భంలో శ్రీరాములయ్య సమాధిని చూపించడానికి దానిని వాడారు.సినిమా మొదలవుతున్న సందర్భంగా వచ్చే ఈ షాట్స్ చూడడానికి చాలా కొత్తగా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube