తెలుగు ప్రేక్షకులకు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి( Sai Pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ బ్యూటీ నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరచుకుంది.
సోషల్ మీడియాలో సాయి పల్లవికి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
అందుకు గల కారణం కూడా లేకపోలేదు.సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్( Pooja Kannan ) ఎంగేజ్మెంట్ వేడుక తాజాగా ముగిసిన విషయం తెలిసిందే.
పూజా నటుడు వినీత్ ( Vineeth )తో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు ఇటీవలే ప్రకటించి అప్పుడే ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటయ్యింది. రెండు రోజుల క్రితమే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది.చాలా గ్రాండ్‌గా ఈ నిశ్చితార్థ వేడుక జరగడం విశేషం.ఈ ఫోటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది సాయిపల్లవి.ఈ ఫంక్షన్ లో బంధువులతో కలిసి సందడి సందడిగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ డాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది సాయి పల్లవి.ఇది ఇలా ఉంటే తాజాగా సాయి పల్లవి కాబోయే పెళ్లి జంటకి ఆమె అభినందనలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
నా చెల్లెలి నిశ్చితార్థం జరిగింది అంటూ బాధపడుతూ, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఎమోజీని పంచుకుంది.ఈ నిశ్చితార్థం సింక్ కావడానికి కొంత సమయం పడుతుంది.తమ్ముడికి అతను ఏమి చేశాడో తెలియదు అని తెలిపింది.ఈ ఎంగేజ్‌మెంట్ అంతా ఓ కలలా ఉందని ఆమె చెప్పింది.అంతేకాదు గుడ్ లక్ వినీత్, మా కుటుంబంలోకి స్వాగతం అని పేర్కొంది సాయిపల్లవి.ఈ సందర్భంగా ఎంగేజ్‌మెంట్‌లోని బ్యూటీఫుల్ మూమెంట్ పిక్స్ ని పంచుకుంది.
ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే సాయి పల్లవి ప్రస్తుతం రెండు మూడు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ఫ్యామిలీతో కలిపి సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది.