2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నియోజకవర్గం( Narasapuram Constituency ) నుంచి పోటీ చేసి విజయం సాధించారు కనుమూరి రఘురామకృష్ణంరాజు.( Raghurama Krishnam Raju ) గెలిచిన కొద్ది నెలలకే ఆయన రెబల్ గా మారారు.
తరచుగా వైసిపి అధినేత జగన్ ను, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే ఆయన విమర్శలు చేస్తున్న తీరు వైసిపికి ఇబ్బందికరంగానే మారింది .టిడిపి ,జనసేన లకు దగ్గరగా ఉంటూ రెండు పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు .ఇక వచ్చే ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రఘురామకృష్ణంరాజు సిద్ధమవుతున్నారు.
టిడిపి, జనసేన ఈ రెండు పార్టీలను ఆప్షన్ గా పెట్టుకున్నారు.అయితే టిడిపి( TDP ) నుంచి పోటీ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఆయన టిడిపిలో చేరినా టిక్కెట్ దక్కుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది.ఒకవేళ టిడిపి ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు బరిలోకి దిగితే ఆయనకు ప్రత్యర్థిగా సినీ నటుడు , దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని( Shyamaladevi ) అభ్యర్థిగా దింపాలనే ఆలోచనతో వైసిపి ఉంది .శ్యామల దేవిని అభ్యర్థిగా బరిలోకి దింపడం ద్వారా, ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) ఓట్లు కూడా కలిసి వస్తాయని ,ఆ ప్రభావం నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పైన ఉంటుందని వైసీపీ( YCP ) అంచనా వేస్తోంది.ఈ మేరకు శ్యామలాదేవిని పోటీకి ఒప్పించేందుకు అదే జిల్లాకు చెందిన వైసిపి నేత ఒకరు రంగంలోకి దిగినట్లు సమాచారం.
కృష్ణం రాజు( Krishnam Raju ) సతీమణి తో రఘురామకు చెక్ పెట్టాలని వైసిపి ప్లాన్ చేస్తోంది.
1999లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కృష్ణంరాజు పోటీ చేసి విజయం సాధించారు.ఇప్పుడు నరసాపురం నుంచి శ్యామలాదేవిని పోటీకి దించడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గం ఓట్లతో పాటు , సినీ హీరో ప్రభాస్ సైతం ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుందని , అలా కాకపోయినా శ్యామలాదేవిని గెలిపించాల్సిందిగా ఆయన ప్రకటన ఇస్తారని ఇవన్నీ తమకు కలిసి వస్తాయని వైసిపి అంచనా వేస్తోంది .